BREAKING
మైనార్టీల ఆస్తులు కబ్జా చేస్తారా? నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రష్యన్ చమురు కొనుగోలుదారులపై అమెరికా ఆంక్షల చట్టం: నిశితంగా పరిశీలిస్తున్నామన్న పీయూష్ గోయల్ నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి... ఆ కారణంతోనే ఏ సర్టిఫికెట్ జారీ చేసిన మేకర్స్ ఓటీటీలోకి ఎం.ఎస్. రాజు మిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అగాధ': డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్! నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల ధర్నా 'అనుమాన పక్షి' రిలీజ్ ట్రైలర్ అవుట్: 'డీజే టిల్లు' డైరెక్టర్ నుంచి క్రేజీ డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్! పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - కలెక్టర్ రాజకుమారి గణీయా క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు సెప్టెంబర్ 25 న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న హిందూపురంలో అంబరాన్నంటిన గణేష్ నిమజ్జనం: 50 అడుగుల గరిడి గణేశుడిపై హెలికాప్టర్‌తో పూల వర్షం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి- ఎస్ డీపీఐ వరంగల్ ఎయిర్ పోర్టుకు"సమ్మక్కసారలమ్మ"పేరు పెట్టాలి కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు చిరస్మరణీయం నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి: చేతి టాటూపై అభ్యంతరం.. సీబీఎఫ్‌సీ ఏ సర్టిఫికేట్ మంజూరు

నీటి విడుదలపై బీజేపీ చేపట్టిన ధర్నా రాజకీయ డ్రామా

Select Suryaa Now
నీటి విడుదలపై బీజేపీ చేపట్టిన ధర్నా రాజకీయ డ్రామా
 
 
బీజేపీ ధర్నాపై సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి ఫైర్
 
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
 
గణేశ్ నిమజ్జనానికి నీటి విడుదలపై బీజేపీ చేపట్టిన ధర్నా రాజకీయ డ్రామా అని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. నిమజ్జన ఏర్పాట్లు, నీటి విడుదలపై మంత్రులు, అధికారులు వారం రోజులుగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు.ఇప్పటికే చింతకుంట కెనాల్‌లో సిల్ట్ తొలగింపు, డస్ట్ పోయడం, అవసరమైన మిషనరీ తరలింపు వంటి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రభుత్వం ముందస్తుగానే నీటి విడుదలపై చర్యలు చేపడుతుండగా, ధర్నా చేసిన ఐదు నిమిషాల్లోనే తమ పోరాటం వల్ల ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
అన్ని పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అన్ని వర్గాల మనోభావాలను గౌరవిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని నరేందర్ రెడ్డి తెలిపారు.