BREAKING
సెప్టెంబర్ 25 న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న హిందూపురంలో అంబరాన్నంటిన గణేష్ నిమజ్జనం: 50 అడుగుల గరిడి గణేశుడిపై హెలికాప్టర్‌తో పూల వర్షం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి- ఎస్ డీపీఐ వరంగల్ ఎయిర్ పోర్టుకు"సమ్మక్కసారలమ్మ"పేరు పెట్టాలి కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు చిరస్మరణీయం నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి: చేతి టాటూపై అభ్యంతరం.. సీబీఎఫ్‌సీ ఏ సర్టిఫికేట్ మంజూరు ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలి తిరుమలేశుని సేవలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‎ సంగెంకలాన్ రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ముంబైలో లగ్జరీ కారు బీభత్సం: మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు కర్ణాటకలో కరవుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి: వారం రోజుల పాటు సభ జరపాలని బీజేపీ డిమాండ్ ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వినాయక నిమజ్జనం నీటి విడుదలపై బీజేపీ చేపట్టిన ధర్నా రాజకీయ డ్రామా

సంగెంకలాన్ రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ

Select Suryaa Now
సంగెంకలాన్ రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ

సంగెంకలాన్ రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ

​*రూ. 14 లక్షల ఆర్థిక సాయం అందించిన చెట్టినాడు సిమెంట్ కంపెనీ

*చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

​తాండూరు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 21):తాండూర్ మండలం సంగెంకలాన్ గ్రామంలో గత ఏడాది కురిసిన అకాల వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులకు ఊరట లభించింది. బాధితులైన 57 మంది రైతులకు రూ. 14 లక్షల విలువైన పంట నష్టపరిహారం చెక్కులను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అందజేశారు. చెట్టినాడు సిమెంట్ కంపెనీ యాజమాన్యం సామాజిక బాధ్యతగా ఈ పరిహారాన్ని ఏర్పాటు చేసింది.​ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సిమెంట్ కంపెనీ ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆశ్వాసన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సిమెంట్ కంపెనీ ప్రతినిధులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.