BREAKING
మైనార్టీల ఆస్తులు కబ్జా చేస్తారా? నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రష్యన్ చమురు కొనుగోలుదారులపై అమెరికా ఆంక్షల చట్టం: నిశితంగా పరిశీలిస్తున్నామన్న పీయూష్ గోయల్ నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి... ఆ కారణంతోనే ఏ సర్టిఫికెట్ జారీ చేసిన మేకర్స్ ఓటీటీలోకి ఎం.ఎస్. రాజు మిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అగాధ': డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్! నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల ధర్నా 'అనుమాన పక్షి' రిలీజ్ ట్రైలర్ అవుట్: 'డీజే టిల్లు' డైరెక్టర్ నుంచి క్రేజీ డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్! పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - కలెక్టర్ రాజకుమారి గణీయా క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు సెప్టెంబర్ 25 న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న హిందూపురంలో అంబరాన్నంటిన గణేష్ నిమజ్జనం: 50 అడుగుల గరిడి గణేశుడిపై హెలికాప్టర్‌తో పూల వర్షం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి- ఎస్ డీపీఐ వరంగల్ ఎయిర్ పోర్టుకు"సమ్మక్కసారలమ్మ"పేరు పెట్టాలి కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు చిరస్మరణీయం నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి: చేతి టాటూపై అభ్యంతరం.. సీబీఎఫ్‌సీ ఏ సర్టిఫికేట్ మంజూరు

వరంగల్ ఎయిర్ పోర్టుకు"సమ్మక్కసారలమ్మ"పేరు పెట్టాలి

Select Suryaa Now
వరంగల్ ఎయిర్ పోర్టుకు"సమ్మక్కసారలమ్మ"పేరు పెట్టాలి


*డిఎస్‌పి వికారాబాద్ జిల్లా కన్వీనర్ రవీందర్ మహారాజ్ డిమాండ్
​*డాక్టర్ విశారదన్ మహారాజ్ ప్రతిపాదనకు పూర్తి మద్దతు
*బహుజనుల ఆరాధ్య దైవాల పేరు పెట్టడమే సముచితం

​వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 21):
వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి బహుజనుల ఆరాధ్య దైవాలైన "సమ్మక్క - సారలమ్మ"ల పేరు పెట్టాలని ధర్మ సమాజ్ పార్టీ (DSP) వికారాబాద్ జిల్లా కన్వీనర్ రవీందర్ మహారాజ్ డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్టుకు సముచితమైన పేరును సూచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిన నేపథ్యంలో, డిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ చేసిన ప్రతిపాదనకు ఆయన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..., తెలంగాణలో 90 శాతానికి పైగా ఉన్న అణగారిన, బహుజన వర్గాల ఆత్మగౌరవానికి సమ్మక్క-సారలమ్మలు ప్రతీకలని పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన వారి పేరును వరంగల్ విమానాశ్రయానికి పెట్టడమే అత్యంత సముచితమని అభిప్రాయపడ్డారు. ప్రచారంలో ఉన్న కాకతీయ లేదా రుద్రమదేవి పేర్లు కేవలం అగ్రకుల నామస్మరణను మాత్రమే గుర్తుచేస్తాయని, వాటిపై తమకు అభ్యంతరం ఉందని స్పష్టం చేశారు. ఒకవేళ వీరనారీమణులైన సమ్మక్క-సారలమ్మల పేరును పెట్టకపోతే, ఈ ప్రభుత్వం అణగారిన వర్గాలకు వ్యతిరేకమని భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి బహుజనుల ఆకాంక్షలకు అనుగుణంగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.