ప్రజా ప్రభుత్వంలో పల్లెలో అభివృద్ధి పరుగులు
ప్రజా ప్రభుత్వంలో పల్లెలో అభివృద్ధి పరుగులు
ఇంటింటికి అభివృద్ధి సంక్షేమం అందిస్తా
టీడీపీ హయాంలోనిర్మించిన ఎత్తిపోతల పథకాలు ప్రజలకు ఒక వరం.
రవాణా వ్యవస్థ తోనే అభివృద్ధి సాధ్యం.
ప్రజల సమస్యలే నా సమస్యలు.
స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి.
బట్లపల్లి టు మారెళ్ళ రోడ్డుకు శంకుస్థాపన చేసిన డాక్టర్ గొట్టపాటి లక్ష్మి
ముండ్లమూరు మేజర్ న్యూస్. కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో సంక్షేమ అభివృద్ధి పరుగులు పెడుతుందని, రవాణా వ్యవస్థ బాగుంటే అభివృద్ధికి దోహదపడుతుందని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. మండలంలోని బట్లపల్లి వయా నూజిళ్ళపల్లి, మారెళ్ళ రహదారి 4.14 కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణానికి దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ సోమవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూఆనాడు మా తాత గొట్టిపాటి హనుమంతరావు , మా నాన్నగొట్టిపాటి నరసయ్య , నేడు గొట్టిపాటి రవికుమార్ ముండ్లమూరు మండలంలో రోడ్లు, ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు వైసిపి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదు. నాకు సొంత మండలం నన్ను అభిమానించే ప్రజలున్న ముండ్లమూరు మండలానికి ఆనాడు మా నాన్న వేసిన రోడ్డు తిరిగి నేను నిర్మించే అవకాశం రావడం నాకెంతో ఆనందంగా ఉంది. మీ అభిమానం మీ ఆప్యాయత నేను ఎప్పటికీ మర్చిపోనుఅని అన్నారు.
నేను కూటమి ప్రభుత్వం అందించే ప్రతి అభివృద్ధి, సంక్షేమం ప్రతి గడపకు అందించాలన్న లక్ష్యంతో మీలో ఒకరిగా, మీ ఇంటి ఆడబిడ్డగా మీతో పాటు ప్రయాణం చేస్తున్నాను. దాదాపు ముండ్లమూరు మండలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 10 కోట్లకు పైగా విలువైన రోడ్లు నిర్మాణాలు చేపట్టాం. ఎన్నడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలను మనం చూస్తున్నాంఅన్నారు.
మీ ఇంటి బిడ్డగా ఇచ్చిన మాట ప్రకారం ఓటమి చెందిన మీ మధ్య ఉంటూ, ప్రజల అవసరాలు తీరుస్తూ, ప్రజల సమస్యలను నా సమస్యలుగా గుర్తించి ముందుకు వెళుతున్నాను అన్నారు. దర్శి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో అభివృద్ధి సంక్షేమం మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా ముందుకు వెళుతూ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామన్నారు.
అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆదరించండి, అభిమానించండి, దీవించండి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. గతంలో వైసిపి ఎన్నికలకు ముందు గొట్టిపాటి లక్ష్మీ నాన్ లోకల్ అంటూ ప్రచారం చేసి ప్రజలలో అనవసరమైన కన్ఫ్యూజ్ లు క్రియేట్ చేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచారు. గెలిచాక మీరు చూస్తున్నారు ఎవరు ప్రజల మధ్య ఉంటున్నారు, ఎవరు ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు మీరు కల్లారా చూస్తున్నారుఅన్నారు .
మీ గెలుపు నా గెలుపుగా చెబుతున్నాను నీ గెలుపులో నా ఆనందం ఉంటుంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అందరూ ఏకపక్షంగా గెలవాలి అందుకు ప్రజలందరూ సంఘటితంగా ముందుకు వెళ్లాలి ఐక్యంగా వైసీపీని ఎదుర్కొనాలి వైసిపి దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి జెండా ఎగరాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీను, మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు, మాజీ మండలం టిడిపి అధ్యక్షులు సోమేపల్లి శ్రీను, దర్శి ఏఎంసి వైస్ చైర్మన్ మస్తాన్ రావు, జనసేన మండల టిడిపి అధ్యక్షులు తోట రామారావు, వరగాని పౌలు, తెల్లయ్య నాగరాజు, స్థానిక నాయకులు, మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, కూటమి శ్రేణులు.