దాడుల సంస్కృతే వైసిపి నైజం
దాడుల సంస్కృతే వైసిపి నైజం
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువులపై గొడ్డలి పార్టీ దాడి అమానుషం.
దాడికి పాల్పడిన వారి పై కఠిన చర్యలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి ,మేజర్ న్యూస్:
ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ స్పష్టం చేశారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే గురువులపై రౌడీ మూకలతో దాడులు చేయించడం దారుణమని, ఈ చర్యను ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అధికారం ఉన్నా.. లేకపోయినా దాడుల సంస్కృతిని వైసీపీ వీడటం లేదని విమర్శించారు. ఎన్నో సవాళ్లను అధిగమించి కూటమి ప్రభుత్వం డీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేపట్టడాన్ని వైసీపీ ఓర్వలేకనే ఉపాధ్యాయులపై దాడులకు దిగుతోందని ఆరోపించారు. ఉపాధ్యాయులంటే జగన్‌కు గిట్టదు కాబట్టే గతంలో వారిని మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారని, ఇప్పుడు అదే గురువులపై దాడులు చేయిస్తున్నారని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మండిపడ్డారు.