అనీషా వలలో జూనియర్ అసిస్టెంట్,అవుట్సోర్సింగ్ సిబ్బది.
సూర్య ఇందూర్
జామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఔట్సోర్సింగ్ సిబ్బంది పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అనిషా వలలో చిక్కారు. ఓ వ్యక్తి తన పనుల కోసం అనుమతి కోరగా సదరు విభాగంలోని అధికారి లంచం ఇవ్వమని అడగగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు వారు పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని రెండో అంతస్తులు గల ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో విధులు నిర్వహించే సదరు జూనియర్ అసిస్టెంట్ అశోక్ కుమార్ రూ.15 వేలు బాధితుడి వద్ద నుండి లంచం తీసుకోవడంతో నిజామాబాద్ తాత్కాలిక నియమక ఏసీబీ డీఎస్‌పీ సుదర్శన్ ఆధ్వర్యంలో దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.