BREAKING
సెర్ప్ కార్యక్రమాలను విజయవంతం కోసం జిల్లా సమాఖ్య కృషి చేయాలి కారులో 22 కిలోల గంజాయి మరో హైదరాబాద్: కల్పనల నీడ నుంచి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక సాధారణ యువకుడి కథ! ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అజేయ ప్రస్థానానికి 48 వసంతాలు! ‘గరివిడి లక్ష్మి’ గ్రాండ్ రిలీజ్ డేట్ ఖరారు: అక్టోబర్ 17న థియేటర్లలోకి ఆనంది బయోపిక్! గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన రాకా చిత్రం.. అల్లు అర్జున్, అట్లీల అరుదైన ఘనత! ఘనంగా దసరా ‘కొత్త బంగారు లోకం’ జోడీ మళ్లీ రిపీట్: 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కాంబో కలయిక! ఆస్ట్రేలియా ఆన్‌లైన్ భద్రత: ఏఐ మరియు సోషల్ మీడియా నిబంధనలపై గ్లోబల్ టెక్ దిగ్గజాల మద్దతు కోరుతున్న ప్రధాని అంటోనీ అల్బనీస్! ఎండాకాలం బూచి చూపి రైతులకు నీళ్లివ్వరా? కాంగ్రెస్ సర్కార్‌పై డీకే అరుణ ధ్వజం ఆస్కార్స్ 2027 రేసులో నాగాలాండ్ చిత్రం ‘అంగ్’: కొత్త నిబంధనలతో నేరుగా అర్హత సాధించిన వైనం ఆర్‌బిఐ సంచలన నిర్ణయం ఆగష్టు 26 భోటేకోశి-త్రిశూలి విపత్తు అధ్యయనం కోసం 15 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన నేపాల్ సింబు స్ట్రెయిట్ తెలుగు సినిమా లాక్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే భారీ ప్రాజెక్ట్ షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కన్నుమూత

ఎండాకాలం బూచి చూపి రైతులకు నీళ్లివ్వరా? కాంగ్రెస్ సర్కార్‌పై డీకే అరుణ ధ్వజం

Select Suryaa Now
ఎండాకాలం బూచి చూపి రైతులకు నీళ్లివ్వరా?  కాంగ్రెస్ సర్కార్‌పై డీకే అరుణ ధ్వజం

జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తక్షణమే నీటిని విడుదల చేయాలన్న డీకే అరుణ 

 జలాశయంలో ప్రస్తుతం సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని వెల్లడి  

రైతులు చేపట్టిన ఆందోళనలకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టీకరణ
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయి నీటి కోసం రైతాంగం అల్లాడుతుంటే, రాబోయే ఎండాకాలాన్ని బూచిగా చూపి కాలువలకు నీటిని నిలిపివేయడం ఏమాత్రం సమంజసం కాదని మండిపడ్డారు. జూరాల జలాశయంలో ప్రస్తుతం సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, కృష్ణా నదికి ఇంకా వరద వచ్చే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. ఒకవేళ వేసవిలో తాగునీటి ఎద్దడి వచ్చినా, ఎగువన కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి అక్కడి నుంచి నీటిని తెప్పించుకునేందుకు చొరవ చూపవచ్చని డీకే అరుణ సూచించారు. జూరాల డ్యాం రోడ్డు, కలెక్టరేట్ ఎదుట రైతులు చేపట్టిన ఆందోళనలకు బీజేపీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని, రైతుల పోరాటానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నీటి కొరత తీవ్రతను వివరిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు. సాగు చేసిన పంటలు చేతికందేలా కాలువలకు నీరు విడుదల చేయాలని కోరడంతో పాటు, అందుబాటులో ఉన్న నీటిని రైతులు కూడా పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు.