BREAKING
తుమ్మక్ తుమ్మక్.. తమన్నా మరో ‘స్పెషల్’ సాంగ్: నెట్టింట ట్రెండ్ అవుతున్న తాజా ఐటమ్ నంబర్! రైతులకు ఉత్తమ సేవలు అందించాలి -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ గణేశ్ నిమజ్జన ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్ల భాగస్వామ్యం న్యూజిలాండ్‌లో ఘనంగా టాలీవుడ్ హీరో ప్రిన్స్ సెసిల్ వివాహం: నెట్టింట వైరలవుతున్న పెళ్లి ఫొటోలు జంతు సంక్షేమం, ప్రజా భద్రతకు ప్రాధాన్యత మంత్రి వాకిటి శ్రీహరి ప్రమాదకర కుక్కల నిర్వహణ, జంతు సంరక్షణ కేంద్రాలు అత్యవసర పశువైద్య సేవలను మెరుగుపరచడంపై చర్చ సెర్ప్ కార్యక్రమాలను విజయవంతం కోసం జిల్లా సమాఖ్య కృషి చేయాలి కారులో 22 కిలోల గంజాయి మరో హైదరాబాద్: కల్పనల నీడ నుంచి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక సాధారణ యువకుడి కథ! ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అజేయ ప్రస్థానానికి 48 వసంతాలు! ‘గరివిడి లక్ష్మి’ గ్రాండ్ రిలీజ్ డేట్ ఖరారు: అక్టోబర్ 17న థియేటర్లలోకి ఆనంది బయోపిక్! గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన రాకా చిత్రం.. అల్లు అర్జున్, అట్లీల అరుదైన ఘనత! ఘనంగా దసరా ‘కొత్త బంగారు లోకం’ జోడీ మళ్లీ రిపీట్: 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కాంబో కలయిక! ఆస్ట్రేలియా ఆన్‌లైన్ భద్రత: ఏఐ మరియు సోషల్ మీడియా నిబంధనలపై గ్లోబల్ టెక్ దిగ్గజాల మద్దతు కోరుతున్న ప్రధాని అంటోనీ అల్బనీస్! ఎండాకాలం బూచి చూపి రైతులకు నీళ్లివ్వరా? కాంగ్రెస్ సర్కార్‌పై డీకే అరుణ ధ్వజం

కారులో 22 కిలోల గంజాయి

Select Suryaa Now
కారులో 22 కిలోల గంజాయి

 

ఇద్దరి అరెస్టు.. మరో ఇద్దరు పరారీ

ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 21) : ఒడిశా నుంచి గోవాకు భారీగా ఎండు గంజాయిని తరలిస్తున్న కారును ఉప్పల్‌ ఎస్‌వోటీ, పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. కారులోని నాలుగు బ్యాగుల్లో ఉన్న 22 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యంనంపేట్‌ చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు కిట్టీ స్టీల్‌ కంపెనీ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మారుతి సుజుకీ బలెనో కారు (జీఏ 07 హెచ్‌ 3746)ను ఆపి తనిఖీ చేయగా డిక్కీలో నాలుగు బ్యాగుల్లో 22 కిలోల ఎండు గంజాయి లభించింది. గోవాలోని పనాజీ, కాజన్‌-జాలెంకు చెందిన అనిల్‌కుమార్‌ గౌడ (30), తాలిగావ్‌కు చెందిన అవినాష్‌ శర్మ (25)ను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.24 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గంజాయిని గోవాలో ఎవరికి విక్రయించేందుకు తరలిస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.