సెర్ప్ కార్యక్రమాలను విజయవంతం కోసం జిల్లా సమాఖ్య కృషి చేయాలి
సూర్య జగిత్యాల ప్రతినిధి: సెర్ప్ కార్యక్రమాల విజయవంతం కోసం జిల్లా మహిళ సమాఖ్య కృషి చేయాలనీ జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి యం. రఘువరణ్ అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయం లో నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా సమాఖ్య కార్యవర్గ సభ్యులు జిల్లా డి. ఆర్. డి. ఓ ని, అదనపు డిఆర్డీఓ సునీత లను అధ్యక్షురాలు యన్. ఆమనీ, కార్యదర్శి రజిత, కోశాధికారి వి. రూప కళ కలిశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు జిల్లా లో 18 మండల సమాఖ్య లు, 565 గ్రామ సమాఖ్య లు, 15466 స్వశక్తి సంఘాలు, 180234 మంది సభ్యులు ఉన్నారని అన్నారు.