రైతులకు ఉత్తమ సేవలు అందించాలి -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
రైతులకు ఉత్తమ సేవలు అందించాలి
-జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి
ఇన్‌పుట్ డీలర్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులు
రైతులకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్ల (డీఏఈఎస్ఐ ) కోర్సు జిల్లాలోని 40 మంది అభ్యర్థులు పూర్తి చేసుకోగా, వారికి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ సోమవారం సర్టిఫికెట్లు పంపిణీ చేసి, అభినందించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. డీఏఈఎస్ఐ కోర్సు, లేదా ఇన్‌పుట్ డీలర్ల కోసం డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్, వ్యవసాయంలో ఇన్‌పుట్ డీలర్ల సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఒక సంవత్సరం డిప్లొమా ప్రోగ్రామ్ రూపొందించి, మేనేజ్ సంస్థ ఆద్వర్యంలో ఎస్ఏఎంఈటీఐ వారి నుంచి శాస్త్రవేత్తలు, అర్హత కలిగిన నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణా అందించారని తెలిపారు.
నేల ఆరోగ్య నిర్వహణ,వ్యవసాయ ఉత్పాదకతలో నేల ఆరోగ్యం - దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం,ఇంటిగ్రేటెడ్ తెగులు నిర్వహణ పద్ధతులను నేర్చుకోవడం, వ్యవసాయ పనిముట్లు - పరికరాలు,యంత్రాలపై పరిచయం, విస్తరణ విధానాలు- పద్ధతులు, రైతులతో సమర్థవంతంగా సంభాషించడానికి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, విత్తన ఉత్పత్తి - నిర్వహణను అర్థం చేసుకోవడం, నీటిపారుదల పద్ధతులను నేర్చుకోవడంపై శిక్షణ అందించారని వివరించారు.
ఈ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేసి, రైతులకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.