ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన పలువురు చైర్మెన్లు
రైతుల అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగాలి
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెల్లడి
తాండూరు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్21): రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలి అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు . తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం తాండూరు సెగ్మెంట్ లోని పలువురు సొసైటీ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు,డైరెక్టర్స్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నీ కలిశారు వివిధ సొసైటీ లలో పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మెల్యే ను కలసి ధన్యవాదాలు చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారు బాధ్యత తోనీ ముందుకు సాగాలి అని అన్నారు . ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నీ కలిసిన వారిలో జనార్దన్ రెడ్డి (తాండూరు) మైపల్ రెడ్డి (పెద్దెముల) కరుణ అజయ్ (బషీరాబాద్) అనిల్ కుమార్ (యలల) తో పాటు బషీరాబాద్ మార్కేట్ కమిటి చైర్మన్ శంకర ప్ప,పలువురు వైస్ చైర్మన్ లు డైరెక్టర్స్ ఉన్నారు.