గణేశ్ నిమజ్జన ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్ల భాగస్వామ్యం
సూర్య జగిత్యాల ప్రతినిధి: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిమజ్జనోత్సవ బందోబస్తులో ట్రాన్స్‌జెండర్లను భాగస్వామ్యం చేస్తూ ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించే అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్లతో సమావేశం నిర్వహించిన ఎస్పీ గణేశ్ నిమజ్జనోత్సవ బందోబస్తులో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించనున్న 17 మంది ట్రాన్స్‌జెండర్లకు టీ-షర్ట్‌లను అందజేశారు. అనంతరం వారికి విధుల నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు, మార్గదర్శకాలను అందించారు.