కీసరలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం
పార్టీ జెండాను ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్
ప్రజల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలి
కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి : రామిడి స్వప్న విజయ్‌రెడ్డి
కీసర, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 21):మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం సోమవారం ఘనంగా ప్రారంభమైంది.కీసర డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి, నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ,... నూతన పార్టీ కార్యాలయం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా పనిచేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, కీసర డివిజన్‌లో నాయకులు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యం:
కీసర డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్‌రెడ్డి మాట్లాడుతూ,.. కీసర డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు.
రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని, నూతన కార్యాలయం ద్వారా ప్రజలకు మరింత చేరువై స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్, డీసీసీ కమిటీ సభ్యులు బక్కని నర్సింగ్‌రావు, పంగ హరిబాబు, దమ్మాయిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్ప రామారావు, జిల్లా ఆర్టీయే సభ్యులు భీమిడి జైపాల్ రెడ్డి,జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్,డైరెక్టర్లు వేణు, ఈగ శ్వేతా ముదిరాజ్, మాజీ మండల అధ్యక్షులు తటాకం వెంకటేష్, మొరుగు ముత్యాలు, కోల కృష్ణ యాదవ్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు పిన్నింటి కృష్ణారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాజా మొయినుద్దీన్, డివిజన్ అధ్యక్షుడు అన్వర్ పాషా, సహకార సంఘం బ్యాంక్ వైస్ చైర్మన్ పన్నాల బుచ్చిరెడ్డి, మాజీ చైర్మన్ గుర్రం లక్ష్మా రెడ్డి తో పాటు మహిళా, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.