BREAKING
సెర్ప్ కార్యక్రమాలను విజయవంతం కోసం జిల్లా సమాఖ్య కృషి చేయాలి కారులో 22 కిలోల గంజాయి మరో హైదరాబాద్: కల్పనల నీడ నుంచి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక సాధారణ యువకుడి కథ! ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అజేయ ప్రస్థానానికి 48 వసంతాలు! ‘గరివిడి లక్ష్మి’ గ్రాండ్ రిలీజ్ డేట్ ఖరారు: అక్టోబర్ 17న థియేటర్లలోకి ఆనంది బయోపిక్! గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన రాకా చిత్రం.. అల్లు అర్జున్, అట్లీల అరుదైన ఘనత! ఘనంగా దసరా ‘కొత్త బంగారు లోకం’ జోడీ మళ్లీ రిపీట్: 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కాంబో కలయిక! ఆస్ట్రేలియా ఆన్‌లైన్ భద్రత: ఏఐ మరియు సోషల్ మీడియా నిబంధనలపై గ్లోబల్ టెక్ దిగ్గజాల మద్దతు కోరుతున్న ప్రధాని అంటోనీ అల్బనీస్! ఎండాకాలం బూచి చూపి రైతులకు నీళ్లివ్వరా? కాంగ్రెస్ సర్కార్‌పై డీకే అరుణ ధ్వజం ఆస్కార్స్ 2027 రేసులో నాగాలాండ్ చిత్రం ‘అంగ్’: కొత్త నిబంధనలతో నేరుగా అర్హత సాధించిన వైనం ఆర్‌బిఐ సంచలన నిర్ణయం ఆగష్టు 26 భోటేకోశి-త్రిశూలి విపత్తు అధ్యయనం కోసం 15 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన నేపాల్ సింబు స్ట్రెయిట్ తెలుగు సినిమా లాక్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే భారీ ప్రాజెక్ట్ షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కన్నుమూత

ప్రజలకు మెరుగైన సేవలే మా లక్ష్యం

Select Suryaa Now
ప్రజలకు మెరుగైన సేవలే మా లక్ష్యం

ప్రజలకు మెరుగైన సేవలే మా లక్ష్యం

- పామూరులో మీకోసం కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
- ప్రజల నుంచి 41 ఫిర్యాదులు స్వీకరణ
 పామూరు, మేజర్ న్యూస్ :  
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పోలీసు వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. సోమవారం పామూరు సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో మీకోసం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి 41 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకుని చట్టప్రకారం విచారణ జరిపి త్వరితగతిన న్యాయం అందించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
కుటుంబ కలహాలు, చీటింగ్, భర్త, అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. మహిళలు, వృద్ధులు తమ సమస్యలను నేరుగా తెలియజేసి పరిష్కారం పొందేలా మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ప్రతి సోమవారం ప్రత్యామ్నాయంగా అన్ని సబ్‌డివిజన్ల పరిధిలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా పోలీసు కార్యాలయంలోనూ యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు.
అదేవిధంగా వై.పాలెం సీఐ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 36 ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో కనిగిరి ఇన్‌చార్జి డీఎస్పీ పి.శ్రీధర్, పామూరు సీఐ వినోద్‌కుమార్, పొదిలి సీఐ రాజేష్‌కుమార్, కనిగిరి సీఐ శ్రీనివాసరావు, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై యాస్మిన్, సిబ్బంది పాల్గొన్నారు.