BREAKING
రష్మిక 'మైసా' టీజర్ రెస్పాన్స్: ఊహించని మాస్ అవతార్‌తో మైండ్ బ్లాక్ చేసిన నేషనల్ క్రష్ భగవంతుడు అందరికీ ఒక్కడే జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక టాస్క్ ఫోర్స్ సదస్సును ప్రారంభించనున్న అమిత్ షా ఎస్ఈసీఐ 15 ఏళ్ల ప్రస్థానం, పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశపు పెరుగుతున్న నాయకత్వానికి నిదర్శనం యువత భవితే కూటమి ప్రభుత్వ లక్ష్యం నేషనల్ ఫార్ములేరీ ఆఫ్ ఇండియా 2026ని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ చిన్నారి వైద్యానికి మంత్రి సుభాష్ మానవతా హస్తం అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మహిశ్రీకి ఆర్థిక సాయం కీసరలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం జైపూర్‌లో WWF గ్లోబల్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ ​కలంతోనే కాదు.. రక్తంతోనూ ప్రాణరక్షణ! ​టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ 4వ క్లౌడ్ రీజియన్ ప్రారంభం అనీషా వలలో జూనియర్ అసిస్టెంట్,అవుట్సోర్సింగ్ సిబ్బది. ఉండవల్లి గుహాలయాల ప్రత్యేకత.. ఇరవై అడుగుల ఏకశిలా అనంత పద్మనాభస్వామి శిల్పకళా వైభవం! భారత్ వర్సెస్ జపాన్ టీ20 పోరుపై తుపాను ముప్పు: మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం ఉందా? నకిలీ కొవిడ్ సర్టిఫికెట్ వివాదం: స్విట్జర్లాండ్ కెప్టెన్ గ్రానిట్ జాకాపై వేటు.. విచారణకు హాజరుకావాలని ఆదేశం

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

Select Suryaa Now
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి
కాటారంలో నివాళులర్పించిన పద్మశాలి సంఘం, ఉత్సవ కమిటీ నాయకులు
కాటారం, సెప్టెంబర్ 21 , మేజర్ సూర్య న్యూస్:
స్వాతంత్ర సమరయోధుడు, మలిదశ తెలంగాణ ఉద్యమ  నేత, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని పలువురు ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు. బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా సోమవారం కాటారం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం, మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువల కోసం బాపూజీ చేసిన కృషి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని దేశ సేవకు అంకితమవ్వడమే కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన నిరంతరం పోరాడారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపించి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన ప్రజా నాయకుడని కొనియాడారు. పదవుల కంటే ప్రజా సేవకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారని, నేటి తరం యువత బాపూజీ జీవిత చరిత్రను తెలుసుకుని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు దోమల సమ్మయ్య, మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, నాయకులు పులి అశోక్, పల్నాటి బలరాం, జల్లారం మల్లయ్య, ఎలుగం రవీందర్, ఎలుగం సత్యనారాయణ, కనుకుంట్ల శ్రీనివాస్, గుల్లపెల్లి శ్రీరామ్ మూర్తి, దోమల రమేష్, దేవలపల్లి రాజమౌళి, జీయ్యారు మల్లయ్య, కోట్టే ప్రభాకర్, గడ్డం కొమురయ్య యాదవ్, ఆత్మకూరి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు