BREAKING
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన రాకా చిత్రం.. అల్లు అర్జున్, అట్లీల అరుదైన ఘనత! ఘనంగా దసరా ‘కొత్త బంగారు లోకం’ జోడీ మళ్లీ రిపీట్: 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కాంబో కలయిక! ఆస్ట్రేలియా ఆన్‌లైన్ భద్రత: ఏఐ మరియు సోషల్ మీడియా నిబంధనలపై గ్లోబల్ టెక్ దిగ్గజాల మద్దతు కోరుతున్న ప్రధాని అంటోనీ అల్బనీస్! ఎండాకాలం బూచి చూపి రైతులకు నీళ్లివ్వరా? కాంగ్రెస్ సర్కార్‌పై డీకే అరుణ ధ్వజం ఆస్కార్స్ 2027 రేసులో నాగాలాండ్ చిత్రం ‘అంగ్’: కొత్త నిబంధనలతో నేరుగా అర్హత సాధించిన వైనం ఆర్‌బిఐ సంచలన నిర్ణయం ఆగష్టు 26 భోటేకోశి-త్రిశూలి విపత్తు అధ్యయనం కోసం 15 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన నేపాల్ సింబు స్ట్రెయిట్ తెలుగు సినిమా లాక్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే భారీ ప్రాజెక్ట్ షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కన్నుమూత ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలి 'స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్' మూడు కంపెనీలపై గూగుల్ జెమిని ఏఐ దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! ట్రంప్ వైమానిక దాడుల రద్దు ప్రజలకు మెరుగైన సేవలే మా లక్ష్యం

యువత భవితే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Select Suryaa Now
యువత భవితే కూటమి ప్రభుత్వ లక్ష్యం

యువత భవితే కూటమి ప్రభుత్వ లక్ష్యం
20 లక్షల ఉద్యోగాల కల్పనకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కృషి
పరిశ్రమలు, పెట్టుబడులతో ఉపాధి అవకాశాల కల్పన
గ్రూప్‌-1 అక్రమాలపై వైసీపీ హయాంలోనే ఆరోపణలు : మంత్రి డోలా
మెగా డీఎస్సీతో 16 వేల ఉద్యోగాల భర్తీ
వైసీపీ అసత్య ప్రచారాలను యువత నమ్మొద్దు
సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

 రాష్ట్రంలోని యువత బంగారు భవిత కోసం కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం ఒంగోలులోని హర్షిణి డిగ్రీ కాలేజీ, దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ‘యువత-భవిత’ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శ్రమిస్తున్నారని చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్స్, పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని, కౌశలం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వర్క్‌ఫ్రమ్‌హోం అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. వైసీపీ హయాంలోనే గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. జగన్‌ అండ్‌ కో గ్రూప్‌-1 ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడి రూ.150 కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా పారదర్శకంగా 16 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. స్పోర్ట్స్‌ కోటాలో ప్రతిభగల క్రీడాకారులకు పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చామని, ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని స్పష్టం చేశారు. ఎక్కడైనా తప్పు జరిగినట్లు నిరూపించాలని టీచర్లు సవాల్‌ చేసినా వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. రౌడీషీటర్లు, గంజాయి బ్యాచ్‌తో టీచర్లపై వైసీపీ అల్లరి మూకల దాడులు చేయడం దుర్మార్గమన్నారు. సమాజంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను యువత నమ్మొద్దని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు