BREAKING
సెర్ప్ కార్యక్రమాలను విజయవంతం కోసం జిల్లా సమాఖ్య కృషి చేయాలి కారులో 22 కిలోల గంజాయి మరో హైదరాబాద్: కల్పనల నీడ నుంచి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక సాధారణ యువకుడి కథ! ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అజేయ ప్రస్థానానికి 48 వసంతాలు! ‘గరివిడి లక్ష్మి’ గ్రాండ్ రిలీజ్ డేట్ ఖరారు: అక్టోబర్ 17న థియేటర్లలోకి ఆనంది బయోపిక్! గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన రాకా చిత్రం.. అల్లు అర్జున్, అట్లీల అరుదైన ఘనత! ఘనంగా దసరా ‘కొత్త బంగారు లోకం’ జోడీ మళ్లీ రిపీట్: 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కాంబో కలయిక! ఆస్ట్రేలియా ఆన్‌లైన్ భద్రత: ఏఐ మరియు సోషల్ మీడియా నిబంధనలపై గ్లోబల్ టెక్ దిగ్గజాల మద్దతు కోరుతున్న ప్రధాని అంటోనీ అల్బనీస్! ఎండాకాలం బూచి చూపి రైతులకు నీళ్లివ్వరా? కాంగ్రెస్ సర్కార్‌పై డీకే అరుణ ధ్వజం ఆస్కార్స్ 2027 రేసులో నాగాలాండ్ చిత్రం ‘అంగ్’: కొత్త నిబంధనలతో నేరుగా అర్హత సాధించిన వైనం ఆర్‌బిఐ సంచలన నిర్ణయం ఆగష్టు 26 భోటేకోశి-త్రిశూలి విపత్తు అధ్యయనం కోసం 15 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన నేపాల్ సింబు స్ట్రెయిట్ తెలుగు సినిమా లాక్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే భారీ ప్రాజెక్ట్ షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కన్నుమూత

రౌడీయిజం చేస్తే తోక కత్తిరిస్తాం

Select Suryaa Now
రౌడీయిజం చేస్తే తోక కత్తిరిస్తాం

రౌడీయిజం చేస్తే తోక కత్తిరిస్తాం

-ఉపాధ్యాయులపై దాడులా?

-టీచర్లపై దాడులను సహించేది లేదు

-దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

-చట్టబద్ధ ప్రక్రియపై కోర్టుకు వెళ్లొచ్చు

-రౌడీలను ఎగదోయడమేంటి?: చంద్రబాబు

-మెగా డీఎస్సీలో అవినీతికి తావే లేదు

-14 సార్లు డీఎస్సీ నిర్వహించాం

-మెగా డీఎస్సీతో 16 వేల ఉద్యోగాలిచ్చాం

-ఉద్యోగాలను అడ్డుకునేందుకు 350 పిటిషన్లు

-కుప్పంతో నాది కుటుంబ అనుబంధం

-‘స్వర్ణ కుప్పం’గా తీర్చిదిద్దడమే లక్ష్యం
సూర్య, స్టేట్ బ్యూరో : 
ఉపాధ్యాయులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రౌడీయిజం చేసేవారి “తోక కత్తిరిస్తాం” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. విజయవాడలో స్పోర్ట్స్‌ కోటా ఉపాధ్యాయులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. చట్టబద్ధ ప్రక్రియపై అభ్యంతరాలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని, దాడులకు పాల్పడటం మాత్రం సరికాదని అన్నారు.
సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం కుప్పంలో నిర్వహించిన ‘స్వర్ణ కుప్పం’ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విజయవాడలో ఉపాధ్యాయులపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. గురువులపై రౌడీలను ఎగదోయడం ఏమిటని ప్రశ్నించారు.
“టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. కఠిన చర్యలు తీసుకుంటాం. అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే సాక్ష్యాధారాలతో సమాధానం చెబుతాం. చట్టబద్ధ ప్రక్రియపై కోర్టుకు వెళ్లొచ్చు.. కానీ దాడులు చేయడమేంటి?” అని చంద్రబాబు ప్రశ్నించారు. గత పాలనలో పాలకులే రౌడీయిజానికి పాల్పడ్డారని ఆరోపించారు. కుప్పం పర్యటనల్లో తాను కూడా ఇబ్బందులు, దౌర్జన్యాలను ఎదుర్కొన్నానని గుర్తు చేశారు. రౌడీయిజం, విధ్వంసక చర్యలకు పాల్పడేవారిని అడ్డుకునే సత్తా కుప్పం ప్రజలకు ఉందన్నారు.
మెగా డీఎస్సీలో అవినీతికి తావులేదు
మెగా డీఎస్సీ విషయంలో ఎలాంటి అవినీతికి అవకాశం ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డీఎస్సీకి టీడీపీ ప్రభుత్వమే చిరునామా అని పేర్కొన్నారు. ఇప్పటివరకు 14 సార్లు డీఎస్సీ నిర్వహించామని, 2024 తర్వాత మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకు వందలాది పిటిషన్లు దాఖలయ్యాయని, వాటిపై ప్రభుత్వం వాస్తవాలను వివరించిందని చెప్పారు.డీఎస్సీ, ఏపీపీఎస్సీ నియామకాల విషయంలో గతంలో ఎక్కడా పేపర్ లీక్ లేదా మ్యానిపులేషన్ జరగలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
కుప్పంతో కుటుంబ అనుబంధం
కుప్పం నియోజకవర్గ ప్రజలతో తనకు కుటుంబ అనుబంధం ఉందని చంద్రబాబు అన్నారు. ప్రతి ఇంట్లో తనను కుటుంబ సభ్యుడిగా చూస్తారని పేర్కొన్నారు. “నారావారిపల్లె జన్మనిస్తే.. కుప్పం రాజకీయ జన్మనిచ్చింది” అని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా కుప్పం ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఆదరిస్తున్నారని గుర్తు చేసుకున్నారు.ఏ పని ప్రారంభించాలన్నా కుప్పం నుంచే శ్రీకారం చుడతానని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడం, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండేలా చూడటం ద్వారా **‘స్వర్ణ కుప్పం’**గా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు.
కుప్పానికి నీళ్లు తీసుకొచ్చాం
రాయలసీమను ఎడారిగా మారనివ్వకూడదనే లక్ష్యంతో ఎన్టీఆర్‌ నీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని చంద్రబాబు తెలిపారు. శ్రీశైలం నుంచి కుప్పానికి సుమారు 660 కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకొచ్చామని చెప్పారు. ఇది సాధ్యం కాదని భావించినవారు ఆశ్చర్యపోయేలా ప్రాజెక్టులను పూర్తి చేశామని పేర్కొన్నారు.కుప్పం అభివృద్ధిలో పర్యాటక రంగానికి కూడా ప్రాధాన్యం ఇస్తామని సీఎం తెలిపారు. హెరిటేజ్‌ గ్రానైట్‌ స్టోన్‌ క్లస్టర్ ఏర్పాటు ద్వారా పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే రూ.2.5 కోట్ల వ్యయంతో మార్కెట్‌యార్డును అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.