BREAKING
సెర్ప్ కార్యక్రమాలను విజయవంతం కోసం జిల్లా సమాఖ్య కృషి చేయాలి కారులో 22 కిలోల గంజాయి మరో హైదరాబాద్: కల్పనల నీడ నుంచి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక సాధారణ యువకుడి కథ! ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అజేయ ప్రస్థానానికి 48 వసంతాలు! ‘గరివిడి లక్ష్మి’ గ్రాండ్ రిలీజ్ డేట్ ఖరారు: అక్టోబర్ 17న థియేటర్లలోకి ఆనంది బయోపిక్! గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన రాకా చిత్రం.. అల్లు అర్జున్, అట్లీల అరుదైన ఘనత! ఘనంగా దసరా ‘కొత్త బంగారు లోకం’ జోడీ మళ్లీ రిపీట్: 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కాంబో కలయిక! ఆస్ట్రేలియా ఆన్‌లైన్ భద్రత: ఏఐ మరియు సోషల్ మీడియా నిబంధనలపై గ్లోబల్ టెక్ దిగ్గజాల మద్దతు కోరుతున్న ప్రధాని అంటోనీ అల్బనీస్! ఎండాకాలం బూచి చూపి రైతులకు నీళ్లివ్వరా? కాంగ్రెస్ సర్కార్‌పై డీకే అరుణ ధ్వజం ఆస్కార్స్ 2027 రేసులో నాగాలాండ్ చిత్రం ‘అంగ్’: కొత్త నిబంధనలతో నేరుగా అర్హత సాధించిన వైనం ఆర్‌బిఐ సంచలన నిర్ణయం ఆగష్టు 26 భోటేకోశి-త్రిశూలి విపత్తు అధ్యయనం కోసం 15 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన నేపాల్ సింబు స్ట్రెయిట్ తెలుగు సినిమా లాక్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే భారీ ప్రాజెక్ట్ షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కన్నుమూత

పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కరించాలి

Select Suryaa Now
పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కరించాలి

పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కరించాలి 

- స్థానిక ఎన్నికలకు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలి

- రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

- చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలి

- ఎస్పీ హర్షవర్ధన్ రాజు

పామూరు, మేజర్ న్యూస్ :
 పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పరిష్కరించాలని మార్కాపురం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌ రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం పామూరు సర్కిల్‌ కార్యాలయంలో కనిగిరి సబ్‌డివిజన్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్ల పనితీరు శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై డీఎస్పీ, సీఐలు, ఎస్సైలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పోలీస్‌స్టేషన్ల వారీగా పెండింగ్‌ కేసులు, అరెస్టులు, దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూఐ కేసులను తగ్గించి పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలని అరెస్టులు, చార్జిషీట్లు, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ముమ్మరం చేయాలని బ్లాక్‌స్పాట్లు, ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
పేకాట, కోడిపందాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.సమావేశంలో కనిగిరి ఇన్‌చార్జి డీఎస్పీ పి.శ్రీధర్‌, పామూరు సీఐలు వినోద్‌కుమార్‌,పొదిలి సీఐ ఎం. రాజేష్‌కుమార్‌, కనిగిరి సీఐ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ దేవప్రభాకర్‌, ఐటీ కోర్‌ ఇన్‌స్పెక్టర్‌ జగదీష్‌, పామూరు ఎస్ఐ అనూప్, ఎస్సైలు పాల్గొన్నారు.