ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
ప్రజావేదికలో 46 అర్జీల స్వీకరణ
అధికారులతో వెంటనే చర్చించి పరిష్కరించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆదేశం
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌రావు చర్యలు చేపట్టారు. సోమవారం ఒంగోలు నగరంలోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన 46 అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించి, వాటిని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో వెంటనే చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు వాటిని సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.