BREAKING
దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి తరలివచ్చే వారికి ముఖ్య సమాచారం 1న యధావిధిగా పింఛన్లు పంపిణీ నంద్యాల మండలంలో విద్యా కమిటీ చైర్మెన్ లో వైసిపి ఏకగ్రీవ ఎన్నిక నంద్యాలలో జాతీయ రహదారి ప్రక్కన చెట్టు కింద విజయ్ పాల డైరీ 39 వ సర్వ సభ్య సమావేశం 9వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ... ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుండి తెదేపాలో చేరిక రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి రాజీ కుదిరిన ఎంపీఓ సర్పంచుల మధ్య వివాదం కొల్హాపూర్‌లో కారు బీభత్సం విజయవాడలో ‘మిషన్ కర్మయోగి’ ప్రాంతీయ సదస్సు: ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఏపీలో రాగల 48 గంటల్లో వర్షాలు సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి. ఎక్మాయ్ గ్రామానికి పీఏసీఎస్ డైరెక్టర్ పదవి అమలాపురంలో సందడి చేసిన హీరోయిన్ మెహ్రీన్ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యున్ని నియమించాలి

సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి.

Select Suryaa Now
సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి.

మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై 9 నెలల క్రితం ప్రారంభమైన సెంట్రల్ లైటింగ్ పనులు ఆగిపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  అర్ధాంతరంగా సెంట్రల్ లైటింగ్ పనులు ఆగిపోవడంతో వాహనాలు వెళుతున్న క్రమంలో వచ్చే దుమ్ము దూళితో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, భారీ వాహనాలు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న రాళ్లు తగిలి పాదాచారులు ప్రమాదాలకు గురవుతున్నారని, అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్డు పనులు ప్రారంభించి రోడ్డు పూర్తి చేయాలని ఆందోళన చేశారు. సంఘటన స్థలానికి గిరిదావర్ రత్తయ్య, స్థానిక పోలీసులు వచ్చి తహశీల్దార్ కు సమాచారం ఇవ్వగా, సంబంధిత శాఖ డిఈ తో మాట్లాడించి త్వరగా పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు వెంకట్ దొర, రామకృష్ణ,లక్ష్మి,బాలాజీ, ఈశ్వర్, ప్రకాష్, వెంకటేష్, తదితరులు ఉన్నారు.

 

సూర్య ప్రతినిధి, అన్నపరెడ్డిపల్లి, చందు