BREAKING
కొత్తగూడెం విక్కుర్తిని మర్యాదపూర్వకంగా కలసిన తెలుగు యువత చర్ల మండల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా పిలక వెంకటరమణారెడ్డి పేదల సొంతింటి కల సాకారం దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి తరలివచ్చే వారికి ముఖ్య సమాచారం 1న యధావిధిగా పింఛన్లు పంపిణీ నంద్యాల మండలంలో విద్యా కమిటీ చైర్మెన్ లో వైసిపి ఏకగ్రీవ ఎన్నిక నంద్యాలలో జాతీయ రహదారి ప్రక్కన చెట్టు కింద విజయ్ పాల డైరీ 39 వ సర్వ సభ్య సమావేశం 9వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ... ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుండి తెదేపాలో చేరిక రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి రాజీ కుదిరిన ఎంపీఓ సర్పంచుల మధ్య వివాదం కొల్హాపూర్‌లో కారు బీభత్సం విజయవాడలో ‘మిషన్ కర్మయోగి’ ప్రాంతీయ సదస్సు: ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఏపీలో రాగల 48 గంటల్లో వర్షాలు

కొల్హాపూర్‌లో కారు బీభత్సం

Select Suryaa Now
కొల్హాపూర్‌లో కారు బీభత్సం

సూర్య జాతీయ డెస్క్: మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెత్వడ్గావ్-హత్కనంగలే రహదారిపై ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన ఎర్టిగా కారు బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో భయానక ప్రమాదం సంభవించింది. కారు ఢీకొట్టిన తీవ్రతకు బైక్‌పై ఉన్న దంపతులు గాల్లోకి దాదాపు 15 అడుగుల ఎత్తున ఎగిరి రోడ్డు పక్కన పడిపోయారు. ఈ భయానక దుర్ఘటనలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ హృదయవిదారక ప్రమాద దృశ్యాలు రోడ్డు పక్కనే ఉన్న ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాంగ్లీ జిల్లా మిరాజ్ నివాసి అయిన దీపక్ రావుసాహెబ్ షిండే (45) స్థానిక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో బ్రాంచ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆయన తన భార్య ఆశారాణి అలియాస్ ఆశాదేవి (40)తో కలిసి కొల్హాపూర్ జిల్లా వాద్గావ్‌లోని హనుమాన్ రోడ్ ప్రాంతంలో ఉంటున్న అనారోగ్యంతో బాధపడుతున్న బంధువును పరామర్శించేందుకు వచ్చారు. రాత్రి అక్కడే బస చేసి, సోమవారం ఉదయం తమ ద్విచక్రవాహనంపై తిరిగి మిరాజ్ వైపు బయలుదేరారు.

వీరి బైక్ మించే గ్రామం సమీపంలోని మలుపు వద్దకు చేరుకోగానే, ఎదురుగా మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఎర్టిగా కారు ఒక్కసారిగా అదుపు తప్పి రాంగ్ రూట్‌లోకి వెళ్లి బైక్‌ను నేరుగా ఢీకొట్టింది. కారు బలంగా ఢీకొట్టడంతో బైక్ నుజ్జునుజ్జయింది. తీవ్ర ప్రభావంతో దంపతులిద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డు పక్కనున్న పొలాల్లో పడిపోయారు. దీపక్ షిండే ఛాతీ, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య ఆశారాణిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఘటనపై సమాచారం అందుకున్న పెత్వడ్గావ్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని, కారును నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ సాహిల్ రాజు ఫజల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మితిమీరిన వేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. నిండు నూరేళ్ల కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం క్షణాల్లో ఛిద్రం చేయడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది