BREAKING
చిన్న జలాలపురం ఎస్ఎంసి ఎన్నికలలో టిడిపి మద్దతుదారుల ఎన్నిక జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అనంతపురంలో రెండవ రోజు మంగళవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహణ నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రెండవ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు గాదే మాధవరెడ్డిని పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలి బండమీద పల్లి ఎస్ఎంసి కమిటీ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక గొట్టిపాటి లక్ష్మి కృషితో గ్రామీణ రోడ్లకు మహర్దశ. ఆపన్నులకు అండగా కూటమి ప్రభుత్వం..ఎమ్మెల్యే అమిలినేని* థాంక్యూ ఎమ్మెల్యే సార్.. తాగునీటి కష్టాలు తీర్చారు మడకశిరలో యువతకు ఉద్యోగ భరోసా రంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడిగా చిలకమర్రి నరసింహ రెడ్డి సూర్యాగ్లోబల్ చర్ల మండల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా పిలక వెంకటరమణారెడ్డి అనంతపురం జిల్లాలో 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

పేదల సొంతింటి కల సాకారం

Select Suryaa Now
పేదల సొంతింటి కల సాకారం

విజయవాడ, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పేదల చిరకాల కల నెరవేరబోతోందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం (సెప్టెంబర్ 30) సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నిర్వహించనున్న ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో 24,057 కుటుంబాలకు క్రమబద్ధీకరణ పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు. మంగళవారం స్టేడియంలో కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఇళ్లలో నివసిస్తున్నప్పటికీ పూర్తి హక్కులు లేని పేదలకు ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసి శాశ్వత భూహక్కులు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రిజిస్ట్రేషన్ ద్వారా పేదలకు తమ ఇళ్లపై చట్టబద్ధమైన హక్కులు లభించడంతో పాటు, పిల్లల చదువులు, వివాహాలు, వైద్య అవసరాలు వంటి కుటుంబ అవసరాలకు ఆస్తిని ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో బ్యాంకు రుణాలు పొందేందుకు కూడా ఈ ఆస్తి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పేదల ఇళ్లకు శాశ్వత హక్కులు కల్పించాలనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అసెంబ్లీలోనూ ప్రస్తావించి జీఓ 30 ద్వారా పేదల తరఫున నిరంతరం కృషి చేశానని బొండా ఉమా తెలిపారు. “పేదల సొంతింటి కల నెరవేరడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఇళ్ల పట్టాలు పేదలకు కేవలం కాగితం కాదు.. వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా, తరతరాలకు ఆస్తి హక్కు” అని అన్నారు. పేదల భూహక్కుల కార్యక్రమం ద్వారా తమ జీవితకాల స్వప్నం నెరవేరుతున్నందుకు లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు.