BREAKING
కొత్తగూడెం విక్కుర్తిని మర్యాదపూర్వకంగా కలసిన తెలుగు యువత చర్ల మండల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా పిలక వెంకటరమణారెడ్డి పేదల సొంతింటి కల సాకారం దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి తరలివచ్చే వారికి ముఖ్య సమాచారం 1న యధావిధిగా పింఛన్లు పంపిణీ నంద్యాల మండలంలో విద్యా కమిటీ చైర్మెన్ లో వైసిపి ఏకగ్రీవ ఎన్నిక నంద్యాలలో జాతీయ రహదారి ప్రక్కన చెట్టు కింద విజయ్ పాల డైరీ 39 వ సర్వ సభ్య సమావేశం 9వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ... ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుండి తెదేపాలో చేరిక రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి రాజీ కుదిరిన ఎంపీఓ సర్పంచుల మధ్య వివాదం కొల్హాపూర్‌లో కారు బీభత్సం విజయవాడలో ‘మిషన్ కర్మయోగి’ ప్రాంతీయ సదస్సు: ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఏపీలో రాగల 48 గంటల్లో వర్షాలు

9వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ... ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుండి తెదేపాలో చేరిక

Select Suryaa Now
9వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ... ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుండి తెదేపాలో చేరిక

మన భూమా మన ధీమా కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ పట్ట ణంలోని 9 వవార్డ్ లో పర్యటించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ

*ఎమ్మెల్యే సమక్షంలో వైకాపా వీడితెదేపాలో చేరిక

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ 
ఆళ్లగడ్డ పట్టణంలో నిర్వహిస్తున్న మన భూమా మన ధీమా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 9వ వార్డు కొత్త మసీదు ఏరియాలో  మంగళవారం  ఎమ్మెల్యే భూమాఅఖిలప్రియ పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా 9వ వార్డుకు చెందిన నూర్‌బాషా కుటుంబ సభ్యులు, ఆయన సోదరులు,  మహబూబ్ బాషా , గౌస్ లాజం, జిలాన్ భాష, వసీం అక్రమ్, హాజీవ్ అలీ, అబ్దుల్, మహబూబ్ బి, రజియా, గౌసియా, మా భుచాన్ ,హసన్ , రసూల్ బి,మరో 10 కుటుంబాలకు చెందిన మొత్తం 40 మంది వైఎస్సార్‌సీపీని వీడి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం, ఆళ్లగడ్డ పట్టణ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని ఆమె తెలిపారు.
ఈ రెండేళ్లలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆళ్లగడ్డలో ఎక్కడైనా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డామా? ఎవరినైనా అనవసరంగా ఇబ్బంది పెట్టామా? అనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.జెండా పట్టుకుని పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ఇబ్బంది పెట్టే సంస్కృతి మాది కాదు. మా పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. ఆళ్లగడ్డలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అందరూ ప్రశాంతంగా జీవించాలన్నదే మా లక్ష్యం అన్నారు.ఆళ్లగడ్డ పట్టణ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  రూ.21 కోట్ల నిధులు కేటాయించారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామన్నారు.ప్రజలు ఎక్కడైనా రోడ్డు కావాలని, డ్రైనేజీ కావాలని అడిగితే సమస్యను పరిశీలించి పరిష్కరించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.కులం, మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని,ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూడా అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నా మన్నారు.