BREAKING
నంద్యాలలో జాతీయ రహదారి ప్రక్కన చెట్టు కింద విజయ్ పాల డైరీ 39 వ సర్వ సభ్య సమావేశం 9వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ... ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుండి తెదేపాలో చేరిక రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి రాజీ కుదిరిన ఎంపీఓ సర్పంచుల మధ్య వివాదం కొల్హాపూర్‌లో కారు బీభత్సం విజయవాడలో ‘మిషన్ కర్మయోగి’ ప్రాంతీయ సదస్సు: ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఏపీలో రాగల 48 గంటల్లో వర్షాలు సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి. ఎక్మాయ్ గ్రామానికి పీఏసీఎస్ డైరెక్టర్ పదవి అమలాపురంలో సందడి చేసిన హీరోయిన్ మెహ్రీన్ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యున్ని నియమించాలి చెరకు రైతులకు రూ.30 కోట్ల బకాయిలు చెల్లించేందుకు సుడాలగుంట షుగర్స్ అంగీకారం తుపాను పంట నష్టం అంచనాలను వేగవంతం చేయండి టాటా గ్రూప్ షేర్లలో క్షీణత మయన్మార్ శరణార్థుల నిర్బంధ తరలింపును ప్రారంభించిన మలేషియా

ప్రభుత్వ వైద్యశాలలో వైద్యున్ని నియమించాలి

Select Suryaa Now
ప్రభుత్వ వైద్యశాలలో వైద్యున్ని  నియమించాలి

గుండాల, సూర్య (మేజర్ న్యూస్). :              

గుండాల ప్రభుత్వ వైద్యశాలలో శాశ్వతంగా వైద్యున్ని నియమించాలని, అక్రమ బెల్ట్ షాపుల ముసుగులో గుడుంబా, నాటుసారా, గంజాయి,  డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) డివిజన్ కార్యదర్శి ఈసం శంకరన్న, మండల కార్యదర్శి కొమరం శాంతయ్య, పివైఎల్ జిల్లా అధ్యక్షులు పూనెం మంగయ్య డిమాండ్ చేశారు. భగత్ సింగ్ 119 వ జయంతి సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో పివైఎల్ డివిజన్ అధ్యక్షులు ఊకే శ్రవణ్ అధ్యక్షతన భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో ప్రదర్శన నిర్వహించి వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో బాలరాజుకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గుండాల ప్రభుత్వ వైద్యశాలలో  2 నెలలుగా పర్మినెంట్ డాక్టర్ లేకపోవడంతో మండల ప్రజలు, రోగులు హాస్పిటల్ కు వస్తే పట్టించుకునే వారు లేరని, వెంటనే జిల్లా వైద్యశాఖాధికారి  ద్వారా శాశ్వతంగా ప్రభుత్వ వైద్యుణ్ని నియమించే విధంగా ఎంపీడీవో చొరవ తీసుకోవాలని  కోరారు.
అదేవిధంగా అక్రమ బెల్ట్ షాపుల ముసుగులో గుడుంబా, నాటు సారా, గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను అమ్మడం వల్ల యువత భారీగా నష్టపోతోందని, 20-25 సంవత్సరాలకే యువత జీవితాలు కుప్పకూలుతున్నాయని, వెంటనే సంబంధిత ఎక్సైజ్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ మండల కార్యదర్శి కల్తీ సుదర్శన్, వజ్జా ధర్మరాజు, జబ్బ గణేష్,  పూనెం సుధాకర్, కుంజ నరేష్, తెల్లం రాజు, సుతారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం ఉమ్మడి జిల్లా : యాకూబ్ రిపోర్టర్ గుండాల