BREAKING
నంద్యాలలో జాతీయ రహదారి ప్రక్కన చెట్టు కింద విజయ్ పాల డైరీ 39 వ సర్వ సభ్య సమావేశం 9వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ... ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుండి తెదేపాలో చేరిక రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి రాజీ కుదిరిన ఎంపీఓ సర్పంచుల మధ్య వివాదం కొల్హాపూర్‌లో కారు బీభత్సం విజయవాడలో ‘మిషన్ కర్మయోగి’ ప్రాంతీయ సదస్సు: ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఏపీలో రాగల 48 గంటల్లో వర్షాలు సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి. ఎక్మాయ్ గ్రామానికి పీఏసీఎస్ డైరెక్టర్ పదవి అమలాపురంలో సందడి చేసిన హీరోయిన్ మెహ్రీన్ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యున్ని నియమించాలి చెరకు రైతులకు రూ.30 కోట్ల బకాయిలు చెల్లించేందుకు సుడాలగుంట షుగర్స్ అంగీకారం తుపాను పంట నష్టం అంచనాలను వేగవంతం చేయండి టాటా గ్రూప్ షేర్లలో క్షీణత మయన్మార్ శరణార్థుల నిర్బంధ తరలింపును ప్రారంభించిన మలేషియా

ఎక్మాయ్ గ్రామానికి పీఏసీఎస్ డైరెక్టర్ పదవి

Select Suryaa Now
ఎక్మాయ్ గ్రామానికి పీఏసీఎస్ డైరెక్టర్ పదవి

నూతన డైరెక్టర్‌కు ఘన సన్మానం.. రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని వెల్లడి

బషీరాబాద్, మేజర్ న్యూస్, (సెప్టెంబర్ 29):బషీరాబాద్ మండల పరిధిలోని ఎక్మాయ్ గ్రామానికి పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) డైరెక్టర్ పదవి దక్కడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తమ గ్రామానికి సహకార సంఘం డైరెక్టర్ పదవి లభించడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు, కాంగ్రెస్ నాయకులు నూతన డైరెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ… ఎక్మాయ్ గ్రామ అభివృద్ధితో పాటు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తామని తెలిపారు. పీఏసీఎస్ ద్వారా రైతులకు అందే పథకాలు, రుణాలు, ఇతర సేవలను అర్హులైన ప్రతి రైతుకు చేరేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.బషీరాబాద్ నియోజకవర్గ నాయకుడు బుయ్యని మనోహర్ రెడ్డి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. గ్రామ అభివృద్ధి, రైతుల సమస్యల పరిష్కారంలో నూతన డైరెక్టర్ చురుకైన పాత్ర పోషించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటప్ప, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నర్సింలు, ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు శామప్ప, మైనారిటీ సెల్ నాయకుడు ఎం.డి. అహ్మద్, గ్రామ పెద్దలు శ్యామయ్య గౌడ్, రాములు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టర్ కాశీం పాషా.