BREAKING
ఎక్మాయ్ గ్రామానికి పీఏసీఎస్ డైరెక్టర్ పదవి అమలాపురంలో సందడి చేసిన హీరోయిన్ మెహ్రీన్ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యున్ని నియమించాలి చెరకు రైతులకు రూ.30 కోట్ల బకాయిలు చెల్లించేందుకు సుడాలగుంట షుగర్స్ అంగీకారం తుపాను పంట నష్టం అంచనాలను వేగవంతం చేయండి టాటా గ్రూప్ షేర్లలో క్షీణత మయన్మార్ శరణార్థుల నిర్బంధ తరలింపును ప్రారంభించిన మలేషియా చిలీ సెంటినెలా రాగి గనిలో సమ్మె దిశగా కార్మికులు కరువు కంటే బంపర్ దిగుబడికే భయపడుతున్న రాయలసీమ రైతులు జనరల్ మోటార్స్ సాంకేతిక ఖర్చులు $20.4 బిలియన్లు తగ్గుతాయన్న అమెరికా ప్రభుత్వం తాండూరులో స్పెషల్ డ్రైవ్.. అభివృద్ధి పనులకు వేగం పెంచాలి రష్యాకు బలవంతంగా తరలించిన ఉక్రెయిన్ పిల్లల కోసం ఆర్థిక సాయాన్ని పెంచిన నార్వే కొల్లబైలు–1లో డ్రైనేజీ సమస్య.. ప్రజల అవస్థలు నల్లగుట్ట పక్కన ఏసీ గోడౌన్ బ్యాక్‌సైడ్‌లో రోడ్డుపైనే మురుగునీరు పంజాబ్ ఎల్‌పీయూలో తీవ్ర ఉద్రిక్తత, విధ్వంసం..భయంతో సొంతూళ్లకు పయనమైన తెలుగు విద్యార్థులు బ్రేకులు వేసినా తగ్గని వేగం!

తాండూరులో స్పెషల్ డ్రైవ్.. అభివృద్ధి పనులకు వేగం పెంచాలి

Select Suryaa Now
తాండూరులో స్పెషల్ డ్రైవ్.. అభివృద్ధి పనులకు వేగం పెంచాలి

 

పట్టణ సమగ్రాభివృద్ధికి నిధుల కొరత ఉండదు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు, మేజర్ న్యూస్,(సెప్టెంబర్ 29):
తాండూరు పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తాండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ రజాక్, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొన్నారు. పట్టణంలోని 1వ వార్డు నుంచి 6వ వార్డు వరకు వివిధ కాలనీల్లో పర్యటిస్తూ స్థానికులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ తదితర అంశాలపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.తాండూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు కృషి చేస్తామని, నిధుల కొరత లేకుండా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే చేపట్టిన పనులను వేగవంతం చేయడంతో పాటు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.ఎమ్మెల్యే వివిధ కాలనీల్లో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడటంతో స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ పంజుగుల రామచందర్.