BREAKING
కొల్లబైలు–1లో డ్రైనేజీ సమస్య.. ప్రజల అవస్థలు నల్లగుట్ట పక్కన ఏసీ గోడౌన్ బ్యాక్‌సైడ్‌లో రోడ్డుపైనే మురుగునీరు పంజాబ్ ఎల్‌పీయూలో తీవ్ర ఉద్రిక్తత, విధ్వంసం..భయంతో సొంతూళ్లకు పయనమైన తెలుగు విద్యార్థులు బ్రేకులు వేసినా తగ్గని వేగం! కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు చేయాలని కోర్టులో పిటిషన్ తెలంగాణ లోకల్ కోటా రావాలంటే ఆ నాలుగేళ్లు తప్పనిసరి: స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ప్రైవేట్ క్రెడిట్ రంగాన్ని టార్గెట్ చేసిన కొత్త షార్ట్ ఫండ్ తెలంగాణ లోకల్ కోటా రావాలంటే ఆ నాలుగేళ్లు తప్పనిసరి కాంగ్రెస్‌లో ఎన్సీపీ విలీనం ప్రచారంపై శరద్ పవార్ స్పష్టత వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక అసలు లబ్ధిదారులు ఎవరు ? స్టాక్ మార్కెట్లలో భారీ పతనం తమిళనాడు రియల్ సింగం పోలీస్ రూపాయి భారీ పతనం దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వాహనంపై దాడి వైట్‌హౌస్ నిషేధంపై న్యాయపోరాటం రజినీకాంత్ జైలర్ 2 మూవీ విడుదల తేదీ ఖరారు.. మోషన్ పోస్టర్‌తో అంచనాలు తారాస్థాయికి!

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

Select Suryaa Now
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

 


ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమీక్ష
తాండూరు, మేజర్ న్యూస్(సెప్టెంబర్ 29):తాండూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ (R&B), పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. పనుల ప్రస్తుత స్థితిగతులు, ఇప్పటివరకు జరిగిన పురోగతి, పెండింగ్‌లో ఉన్న పనులు, వాటి పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు అందేలా అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి, శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ప్రజల అవసరాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తాండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు.రిపోర్టర్ రామచందర్.