సత్తుపల్లిలో మంత్రి తుమ్మల పర్యటన
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ
సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్...
( కిరణ్ కుమార్ ఆరిక)
సత్తుపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పర్యటించారు. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ లు తుమ్మలకు ఘన స్వాగతం పలికారు. సత్తుపల్లిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహన్ని సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ లతో కలిసి మంత్రి తుమ్మల ఆవిష్కరించారు. అనంతరం వేంసూరు మండలం కల్లూరు గూడెంలో నూతనంగా నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసిపి వసుంధర యాదవ్, ప్రభుత్వ అధికారులు,సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి పట్టణ మున్సిపల్ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, పసుమర్తి చందర్ రావు, నిర్వాహకులు పద్మారావు, పద్మశాలి సంఘం కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, ఎన్ఎస్ యు ఐ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు అభిమానులు పాల్గొన్నారు.