సర్వోత్తమరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలి
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలి
తుంగతుర్తిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు హెల్ప్‌డెస్క్ ప్రారంభంలో
ఎమ్మెల్యే మందుల సామేల్
తుంగతుర్తి మేజర్ న్యూస్
నల్గొండ ఖమ్మం వరంగల్ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన రామ్‌రెడ్డి సర్వోత్తమరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన నియోజకవర్గస్థాయి ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తపై ఉందని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సొంత ప్రాంతం తుంగతుర్తి, మరియు ఈ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఉండడం చేత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. అందువలన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు క లిసికట్టుగా కృషి చేయాలని కోరినారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకునేందుకు వీలుగా నియోజకవర్గ స్థాయిలోని అన్ని మండలాలలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించారు.12 నియోజకవర్గాల్లో ప్రధమంగా తుంగతుర్తి నియోజకవర్గంలోనే ఈ హెల్ప్ డెస్క్ లను ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లే ముందు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సౌకర్యం, రేషన్ షాపులో పేదలకు ఇస్తున్న సన్న బియ్యం లాంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. వచ్చే ఆసంగిలో సీజన్లో నీటి కొరత ఉండబోవడం వలన,రైతుల�