BREAKING
వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం బ్రిటన్ తాగునీటి సంస్థకు ఊరట నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సొంత నిధులతో సిమెంట్ చెత్త కుండీల ఏర్పాటు... హైతాబాద్‌లో శ్రీశ్రీ సరస్వతీ మాతగా దర్శనమిచ్చిన దుర్గామాత సాగు హక్కు పత్రాలు ఇవ్వాలి.. ఖాళీలు వేలల్లో.. నోటిఫికేషన్ వందల్లోనా.. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన: 71 అడుగుల మహాదేవ్ విగ్రహానికి శంకుస్థాపన పోతుగల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు అమెరికా-లెబనాన్ నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు మళ్లీ విఘాతం విజయవాడ చేరుకున్న చైనా రాయబారి జూ ఫీహాంగ్ బృందం: సాదర స్వాగతం పలికిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్,.... గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది – ఎంపీ మల్లు రవి 21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

శరన్నవరాత్రుల్లో సరస్వతీ దేవిగా అమ్మవార్ల దర్శనం..

Select Suryaa Now
శరన్నవరాత్రుల్లో సరస్వతీ దేవిగా అమ్మవార్ల దర్శనం..

(అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్)

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని అనంతపురం నగరంలోని పలు ఆలయాలు, మఠాల్లో శుక్రవారం విశేష పూజలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మ నక్షత్రంగా భావించే మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలు ఆలయాల్లో అమ్మవార్లు సరస్వతీ దేవి, విద్యాదాయిని అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

*చిన్మయ జగదీశ్వరాలయంలో సామూహిక కుంకుమార్చన..*

తపోవనంలోని శ్రీ చిన్మయ జగదీశ్వరాలయంలో శ్రీ ప్రసన్న పార్వతీ అమ్మవారి సన్నిధిలో దాదాపు వంద మంది మహిళా భక్తులతో లలితా సహస్రనామ సహిత సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ప్రతిరోజూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు దసరా రోజున అమ్మవారి ప్రసాదం, తాంబూలం అందజేయనున్నట్లు స్వామి ఆత్మ విధానంద తెలిపారు.

*శృంగేరి శంకరమఠంలో అక్షరాభ్యాసాలు*

శారదానగర్‌లోని శ్రీ శృంగేరి శంకరమఠంలో శారదా పరమేశ్వరి అమ్మవారు వీణాధారిణిగా భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో దాదాపు 70 మంది విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.

*వివిధ ఆలయాల్లో విశేష అలంకరణలు*

ఒకటో రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయంలో దసరా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సాయంత్రం అశ్వ వాహనంపై శ్రీ వారాహి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
హెచ్ఎల్‌సీ కాలనీలోని శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించారు. ఇదే కాలనీలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారు కూడా సరస్వతీ దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.
శ్రీ శివ బాలయోగి మహరాజ్ ఆశ్రమంలో శ్రీ అనంతేశ్వరి అమ్మవారు సరస్వతీ దేవిగా అలంకరించుకొని భక్తులకు దర్శనమిచ్చారు. తపోవనంలోని శ్రీ వేదమాత గాయత్రీ దేవి ఆలయంలో అమ్మవారిని చదువుల తల్లిగా అలంకరించి పూజలు నిర్వహించారు.

*శ్రీ జ్ఞాన పీఠంలో విద్యా హోమం*

శ్రీ జ్ఞాన పీఠంలో అన్నపూర్ణ ఆవరణ అర్చనతో పాటు లోకకల్యాణార్థం శ్రీనివాస విద్యా హోమాన్ని నిర్వహించారు. శాస్త్రోక్తంగా లఘు పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సాయంత్రం అమ్మవారు విద్యాదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

*శివకోటి శ్రీ పీఠంలో నవచండీ పారాయణం*

శివకోటి శ్రీ పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. నవచండీ పారాయణం, శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చనతో పాటు సాయంత్రం అమ్మవారి హోమం నిర్వహించారు. అనంతరం శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
మూలా నక్షత్రం సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. విద్యాభివృద్ధి, జ్ఞానప్రాప్తి కలగాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు.