BREAKING
గుండె స్టెంట్ల భద్రతపై ఆందోళన! నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన నాని 'ది ప్యారడైజ్'.. డేట్ లాక్! రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి. • నడిపెల్లి విజిత్‌ కుమార్‌ హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. 'డెస్టినీ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కలరిక్కల్ హఠాన్మరణం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి

ఖాళీలు వేలల్లో.. నోటిఫికేషన్ వందల్లోనా..

Select Suryaa Now
ఖాళీలు వేలల్లో.. నోటిఫికేషన్ వందల్లోనా..


- పోలీస్ శాఖలో 11 వేల పోస్టులు భర్తీ చేయాలి...
- నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వెంటనే ప్రకటించాలి...
- ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మొజ్జాడ. యుగంధర్ డిమాండ్...

శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయడంతో పాటు, ప్రస్తుత నియామక ప్రక్రియలో కనీసం 11 వేల పోస్టులను చేర్చి నోటిఫికేషన్ విడుదల చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ డిమాండ్ చేశారు.శ్రీకాకుళం క్రాంతి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యుగంధర్  మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.పోలీస్ శాఖలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ పరిమిత సంఖ్యలో పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగ యువతకు అవకాశం దక్కకుండా పోతుందని అన్నారు. పోలీస్ శాఖలో 20 వేలకుపైగా ఖాళీలు ఉన్నట్లు గతంలో అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ఖాళీలకు అనుగుణంగా భారీ స్థాయిలో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పోలీస్ శాఖలో 11,639 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి కోరినప్పటికీ, ప్రభుత్వం తక్కువ సంఖ్యలో పోస్టులతో నియామక ప్రక్రియ చేపట్టడం సరికాదన్నారు. నిరుద్యోగ యువత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కనీసం 11 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.గత ఏడు సంవత్సరాలుగా పోలీస్ నియామకాలు సక్రమంగా జరగకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి కారణంగా ఉద్యోగ అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందువల్ల పోలీస్ ఉద్యోగాల అభ్యర్థుల వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. డిగ్రీలు, పీజీలు చదివిన యువత ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి, నియామకాలకు స్పష్టమైన కాలపట్టిక ప్రకటించాలని
పోలీస్ శాఖలో 11 వేల పోస్టులు పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలి.పోలీస్ శాఖలో ఉన్న అన్ని ఖాళీలను దశలవారీగా భర్తీ చేయాలి.పోలీస్ ఉద్యోగాల అభ్యర్థుల వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలి.ప్రతి సంవత్సరం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలని అన్నారు . రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ ఎన్నికలలోఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని లేనిపక్షంలో నిరుద్యోగ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్, నాయకులు అన్నాజీ, సింహాచలం, హేమంత్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు