telanagana
బీజేవైఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి కొమ్మిడి విక్రాంత్ రెడ్డి
ఘట్కేసర్, మేజర్ న్యూస్:బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా కార్యదర్శిగా కొమ్మిడి విక్రాంత్ రెడ్డి ని నియమించారు. ఘట్కేసర్ పట్టణానికి చెందిన కొమ్మిడి విక్రాంత్ రెడ్డి బీజేవైఎం బలోపేతానికి చేస్తున్న కృషిని గుర్తించి పదవిని అప్పగించినట్లు జిల్లా బిజెపి అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ పేర్కొన్నారు. తనను నియమించడం పట్ల కొమ్మిడి విక్రాంత్ రెడ్డి ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగం అర్జున్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఘట్కేసర్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నాయకులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానన్నారు. యువతను ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని, ఈ పదవిని ప్రజాసేవకు లభించిన అవకాశంగా భావించి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.