BREAKING
వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం బ్రిటన్ తాగునీటి సంస్థకు ఊరట నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సొంత నిధులతో సిమెంట్ చెత్త కుండీల ఏర్పాటు... హైతాబాద్‌లో శ్రీశ్రీ సరస్వతీ మాతగా దర్శనమిచ్చిన దుర్గామాత సాగు హక్కు పత్రాలు ఇవ్వాలి.. ఖాళీలు వేలల్లో.. నోటిఫికేషన్ వందల్లోనా.. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన: 71 అడుగుల మహాదేవ్ విగ్రహానికి శంకుస్థాపన పోతుగల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు అమెరికా-లెబనాన్ నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు మళ్లీ విఘాతం విజయవాడ చేరుకున్న చైనా రాయబారి జూ ఫీహాంగ్ బృందం: సాదర స్వాగతం పలికిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్,.... గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది – ఎంపీ మల్లు రవి 21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన కలెక్టర్ చిత్రా మిశ్రా

Select Suryaa Now
ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన కలెక్టర్ చిత్రా మిశ్రా
 సూర్య కరీంనగర్ ప్రతినిధి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కరీంనగర్‌లోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో శుక్రవారం రాత్రి ఉద్యోగుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారినిలతో, ఉద్యోగినులతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. తెలంగాణ జానపద గీతాలు, సన్నాయి, డోలు వాయిద్యాల నడుమ ఐడీఓసీ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
కరీంనగర్ జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో, ఎంప్లాయిస్ జేఏసీ భాగస్వామ్య సంఘాల నాయకులు, 
ఉద్యోగుల సహకారంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.
 ఈ సందర్భంగా సత్తుపిండి వితరణ చేపట్టారు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాదని, మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఇలాంటి సాంస్కృతిక వేడుకలు ఉద్యోగుల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు రూపొందించిన బతుకమ్మలను కలెక్టర్ పరిశీలించి, ఎంపిక చేసిన బతుకమ్మల నిర్వాహకులకు బహుమతులు అందజేశారు. వేడుకల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనగా, ఉద్యోగ సంఘాల నాయకులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి జిల్లాస్థాయి అధికారులు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, టీఎన్జీవోల సంఘం కార్యదర్శి సంగేం లక్ష్మణ్ రావు, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి అరవింద్ రెడ్డి, రెవెన్యూ సర్వీస్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, నేరెళ్ల కిషన్, మహిళా నాయకులు శారద, సునీత, సరిత, సూర్య, శైలజ, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మీంధర్ సింగ్, ప్రభాకర్ రెడ్డి, రమేష్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంత్ రావు, మామిడి రమేష్, పోలూ కిషన్, అజ్గర్ అలీ, శంకర్, పెన్షనర్ల సంఘం నాయకుడు పెండ్యాల కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.