BREAKING
వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం బ్రిటన్ తాగునీటి సంస్థకు ఊరట నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సొంత నిధులతో సిమెంట్ చెత్త కుండీల ఏర్పాటు... హైతాబాద్‌లో శ్రీశ్రీ సరస్వతీ మాతగా దర్శనమిచ్చిన దుర్గామాత సాగు హక్కు పత్రాలు ఇవ్వాలి.. ఖాళీలు వేలల్లో.. నోటిఫికేషన్ వందల్లోనా.. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన: 71 అడుగుల మహాదేవ్ విగ్రహానికి శంకుస్థాపన పోతుగల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు అమెరికా-లెబనాన్ నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు మళ్లీ విఘాతం విజయవాడ చేరుకున్న చైనా రాయబారి జూ ఫీహాంగ్ బృందం: సాదర స్వాగతం పలికిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్,.... గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది – ఎంపీ మల్లు రవి 21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

యూనిక్ కంపెనీ పేరుతో పెట్టుబడుల మోసం.. ప్రధాన నిందితుడు అరెస్ట్

Select Suryaa Now
యూనిక్ కంపెనీ పేరుతో పెట్టుబడుల మోసం.. ప్రధాన నిందితుడు  అరెస్ట్
సూర్య కరీంనగర్ ప్రతినిధి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన యూనిక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ రాయ్ అలియాస్ రాజ్ కుమార్ కైలాష్ రాయ్‌ను పెట్టుబడుల మోసం కేసులో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.అధిక లాభాలు, మెచ్యూరిటీ ప్రయోజనాలు, అవసరమైతే ప్లాట్లు కేటాయిస్తామని నమ్మించి వార్షిక చెల్లింపులు, నెలవారీ కిస్తీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా ప్రజల నుంచి భారీగా డబ్బులు సేకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గడువు ముగిసినప్పటికీ పెట్టుబడులు, మెచ్యూరిటీ మొత్తాలను తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. దేశవ్యాప్తంగా సుమారు 10 వేల మంది బాధితులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మోసం ద్వారా సేకరించిన డబ్బులతో నిందితుడు పలు రాష్ట్రాల్లో హోటళ్లు, భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.కరీంనగర్ జిల్లాలో యూనిక్ కంపెనీ పేరుతో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు వెంటనే కరీంనగర్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌ను లేదా అడిషనల్ డీసీపీ (అడ్మిన్)ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.బాధితులు తమ వద్ద ఉన్న పెట్టుబడి రశీదులు, బ్యాంకు లావాదేవీల వివరాలు, కంపెనీకి సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను ఫిర్యాదుతో పాటు సమర్పించాలని సూచించారు.