telanagana
ఘట్కేసర్లో వివాహిత అదృశ్యం
ఘట్కేసర్, మేజర్ న్యూస్(అక్టోబర్, 16):ఓ వివాహిత వివాహిత అదృశ్యమైన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘనాపూర్లో వివాహిత అంజు మాణిక్పురి (35) ఈ నెల 14న భర్త సంజయ్ దాస్ మాణిక్పురి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. ఫోన్కు కాల్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో సర్వర్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, అదృశ్యమైన మహిళ కోసం గాలిస్తున్నారు. అంజు మాణిక్పురి ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు కాగా, తెల్లని ఛాయతో, అదృశ్యమైన సమయంలో నీలం రంగు దుస్తులు ధరించింది. ఆమె ఆచూకీ తెలిసినవారు ఘట్కేసర్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.