BREAKING
వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం బ్రిటన్ తాగునీటి సంస్థకు ఊరట నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సొంత నిధులతో సిమెంట్ చెత్త కుండీల ఏర్పాటు... హైతాబాద్‌లో శ్రీశ్రీ సరస్వతీ మాతగా దర్శనమిచ్చిన దుర్గామాత సాగు హక్కు పత్రాలు ఇవ్వాలి.. ఖాళీలు వేలల్లో.. నోటిఫికేషన్ వందల్లోనా.. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన: 71 అడుగుల మహాదేవ్ విగ్రహానికి శంకుస్థాపన పోతుగల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు అమెరికా-లెబనాన్ నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు మళ్లీ విఘాతం విజయవాడ చేరుకున్న చైనా రాయబారి జూ ఫీహాంగ్ బృందం: సాదర స్వాగతం పలికిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్,.... గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది – ఎంపీ మల్లు రవి 21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

బండ మాదారం లో యథేచ్ఛగా అక్రమ మట్టి దందా…!

Select Suryaa Now
బండ మాదారం లో యథేచ్ఛగా అక్రమ మట్టి దందా…!
 మేడ్చల్, మేజర్ న్యూస్:ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండ మాదారం గ్రామంలో అక్రమ మట్టి దందా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా మూడు బొక్కెన్లు, ఆరు ట్రిప్పర్ల మట్టి అక్రమ దందా జరుగుతుంది, మట్టి తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.గతంలోనూ సర్వే నంబర్లతో పాటు లొకేషన్ వివరాలను ప్రస్తావిస్తూ అక్రమ మట్టి తవ్వకాలపై సమాచారం అందించినప్పటికీ, అక్రమ మట్టిస్తావరాలు తెలియకపోవడం అధికారుల యొక్క వైఫల్యానికి నిదర్శనం అని స్థానికులు వాపోతున్నారు. గ్రామంలోని వాట్సాప్ గ్రూపుల్లో సైతం మట్టి తవ్వకాలకు సంబంధించిన ఫొటోలు ప్రచారంలోకి వస్తున్నా, అధికారుల నుంచి తగిన స్పందన లేకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపుపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బండ మాదారం గ్రామంలో కొనసాగుతున్న మట్టి తవ్వకాలపై రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు చేపడతారా? అన్నది వేచి చూడాలి.