BREAKING
వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం బ్రిటన్ తాగునీటి సంస్థకు ఊరట నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సొంత నిధులతో సిమెంట్ చెత్త కుండీల ఏర్పాటు... హైతాబాద్‌లో శ్రీశ్రీ సరస్వతీ మాతగా దర్శనమిచ్చిన దుర్గామాత సాగు హక్కు పత్రాలు ఇవ్వాలి.. ఖాళీలు వేలల్లో.. నోటిఫికేషన్ వందల్లోనా.. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన: 71 అడుగుల మహాదేవ్ విగ్రహానికి శంకుస్థాపన పోతుగల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు అమెరికా-లెబనాన్ నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు మళ్లీ విఘాతం విజయవాడ చేరుకున్న చైనా రాయబారి జూ ఫీహాంగ్ బృందం: సాదర స్వాగతం పలికిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్,.... గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది – ఎంపీ మల్లు రవి 21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

28న ఆత్రేయపురంలో 108 కల పూజ

Select Suryaa Now
28న ఆత్రేయపురంలో 108 కల పూజ

ఆత్రేయపురం మేజర్ న్యూస్ ఆత్రేయపురం మహాత్మా గాంధీ జూనియర్ కళాశాల మైదానంలో  ఈనెల 28న 108 కళాశాలతో మహా కలశపూజ నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కళాశాల ప్రాంగణంలో జరిగే ఈ మహోత్సవానికి శుక్రవారం పందిరిరాట్నం ముహూర్తం కార్యక్రమాన్ని స్వాములు ఘనంగా నిర్వహించారు  సమీప గ్రామాల నుంచి వెయ్యి మంది పైబడి అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన స్వాములుతో 108 కళాశాలతో శాస్త్రోక్తంగా మహా కలశపూజ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి అతిరథ మహారధులు వస్తున్నారు  ఈ నెల 28న  జరిగే మహోత్సవంలో రాజేష్ గురుస్వామి, మధు నంబూద్రి గురుస్వామి చిన్ని స్వామి  ఆధ్వర్యంలో శబరిమలలో నిర్వహించే తాంత్రిక విధానాన్ని అనుసరించి మహాపడి పూజ నిర్వహించనున్నారు. శ్రీ విజయ దుర్గ అయ్యప్ప గానామృతం, సంగీత స్వరసని కార్యక్రమాలతో పాటు జాతీయ అవార్డు గ్రహీతలు, సువర్ణ సింహతలాట సన్మానితుల సమక్షంలో భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు మహోత్సవ కార్యక్రమాల వివరాలు మధ్యాహ్నం 2 గంటలకు: కలశాల ఊరేగింపు, పేటతుళ్లల్ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు: 108 కలశాల పూజ  రాత్రి 8 గంటలకు: మహాపడి పూజ రాత్రి 8.30 గంటలకు: భజన తరంగిణి, భక్తి సంగీత విభావరి రాత్రి 10 గంటలకు: అయ్యప్ప స్వాములకు, భక్తులకు వడి సమర్పణ ఈ మహా కలశ పూజ మహోత్సవానికి గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కమిటీ  స్వాములు, భక్తులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు