BREAKING
వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం బ్రిటన్ తాగునీటి సంస్థకు ఊరట నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సొంత నిధులతో సిమెంట్ చెత్త కుండీల ఏర్పాటు... హైతాబాద్‌లో శ్రీశ్రీ సరస్వతీ మాతగా దర్శనమిచ్చిన దుర్గామాత సాగు హక్కు పత్రాలు ఇవ్వాలి.. ఖాళీలు వేలల్లో.. నోటిఫికేషన్ వందల్లోనా.. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన: 71 అడుగుల మహాదేవ్ విగ్రహానికి శంకుస్థాపన పోతుగల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు అమెరికా-లెబనాన్ నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు మళ్లీ విఘాతం విజయవాడ చేరుకున్న చైనా రాయబారి జూ ఫీహాంగ్ బృందం: సాదర స్వాగతం పలికిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్,.... గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది – ఎంపీ మల్లు రవి 21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కన్నుల పండువగా బతుకమ్మ సంబురాలు: పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని చాటిన ఉద్యోగులు

Select Suryaa Now
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కన్నుల పండువగా బతుకమ్మ సంబురాలు: పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని చాటిన ఉద్యోగులు

సూర్య సాంస్కృతిక డెస్క్: తెలంగాణ నేల వైభవానికి, ప్రజల సాంస్కృతిక చైతన్యానికి, తరతరాలుగా కొనసాగుతున్న పూల పండుగ సంప్రదాయానికి, ప్రకృతితో మమేకమైన జీవన తత్వానికి ప్రతిరూపమైన బతుకమ్మ పండుగను సనత్ నగర్‌లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రుల ఆధ్యాత్మిక శోభను మరింత ఇనుమడింపజేస్తూ, ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా సంప్రదాయబద్ధంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవంలో మహిళా ఉద్యోగులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, పూల పరిమళాలు, మహిళా ఉద్యోగుల బతుకమ్మ ఆటపాటలతో కార్యాలయ ప్రాంగణం అంతా పండుగ శోభను సంతరించుకుంది.

ఉదయం మహిళా ఉద్యోగులంతా దుర్గాదేవికి భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొని, ఆ తర్వాత బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్నారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర సహజసిద్ధమైన పూలతో అందంగా బతుకమ్మలను అలంకరించి, మధ్యలో గౌరమ్మను ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బతుకమ్మల చుట్టూ చేరి, బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటమాడుతూ ఉత్సాహంగా సంబురాలు జరుపుకున్నారు. సంప్రదాయ ఆటపాటలు, బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్న తర్వాత బతుకమ్మలను సంప్రదాయబద్ధంగా నీటి తొట్టెల్లో నిమజ్జనం చేశారు. అమ్మవారికి నివేదించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి, పరస్పరం పంచుకుంటూ బతుకమ్మ వేడుకలను ఆనందభరిత వాతావరణంలో ముగించారు.

ఈ సందర్భంగా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శకుంతల మాట్లాడుతూ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగను ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగులుగా ప్రతి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవడంతో పాటు, ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సహజసిద్ధంగా ప్రకృతిలో లభించే పూలు, ఆకులతో బతుకమ్మలను పేర్చి సంబరాలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. బతుకమ్మ పుట్టుకకు సంబంధించి ఎన్నో జానపద కథలు, విశ్వాసాలు ప్రచారంలో ఉన్నప్పటికీ, బతుకు మరియు బతుకనివ్వు అనే జీవన సూత్రమే బతుకమ్మ పండుగ అందించే గొప్ప సందేశమని పేర్కొన్నారు. మనకు జీవితాన్ని ప్రసాదించిన ప్రకృతిని కాపాడుకుంటూ, ప్రకృతే మన మనుగడకు ఆధారమని, ప్రకృతి పరిరక్షణే భావితరాల భవిష్యత్తుకు భరోసా అని గుర్తించాలని సూచించారు. మట్టి గణపతుల పంపిణీ, పర్యావరణహితంగా బతుకమ్మ పండుగ నిర్వహణ, గ్రీన్ దీపావళి థీమ్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నియంత్రణ మండలి ప్రతి ఏటా ప్రభావవంతమైన కార్యక్రమాలను చేపడుతున్నదని అన్నారు. పూలతో బతుకమ్మను పేర్చి ప్రకృతిని ఆరాధించే మనం, అదే స్ఫూర్తితో జలవనరులను కలుషితం కాకుండా కాపాడుకోవడం, పర్యావరణానికి హాని కలిగించని విధంగా పండుగలను జరుపుకోవడం అలవర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఎంప్లాయిస్ అసోసియేషన్ కల్చరల్ సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అరుణ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగను సహజసిద్ధమైన పూలతో, ప్లాస్టిక్ అలంకరణలకు దూరంగా పర్యావరణహితంగా జరుపుకోవాలని సూచించారు. బతుకమ్మ ఆటల తర్వాత సంప్రదాయం ప్రకారం జలాశయాల్లో నిమజ్జనం చేసే సమయంలో ప్లాస్టిక్ కవర్లు, అనవసర అలంకరణలు, ఇతర వ్యర్థాలు నీటిలో కలవకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మన సంప్రదాయాలను కాపాడుకుంటూ, ప్రకృతిని పరిరక్షిస్తూ, పర్యావరణహిత పండుగలను భావితరాలకు అందిద్దామని తన సందేశాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పలువురు బాధ్యులు, టిజిపిసిబి కార్యాలయ ఇంజనీరింగ్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ తదితర విభాగాలకు సంబంధించిన పలువురు సిబ్బంది పాల్గొన్నారు.