telanagana
పేదల కళ్లలో సంతోషం చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డొంకెని శంకర్ గౌడ్
ఘట్కేసర్, మేజర్ న్యూస్:ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డొంకెని శంకర్ గౌడ్ అన్నారు. ఔషపూర్లో తేజావత్ సరోజ ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా స్లాబ్ పనులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఈ సందర్భంగా శంకర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కవాడి మాధవ రెడ్డి, ఉపాధ్యక్షుడు కందకట్ల సందీప్ రెడ్డి, డివిజన్ అధికార ప్రతినిధి కంచర్ల వెంకట్ రెడ్డి, నరసింహ నాయక్. సోనియా నాయక్, మేస్త్రి శీను తదితరులు పాల్గొన్నారు.