సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
మాగనూర్ సూర్య న్యూస్ :
మండలంలోని కొల్పూర్ లో గ్రామ సర్పంచ్ ముద్ద రాములు ఇటీవల అకాల మరణం చెందడంతో రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి బుధవారం వారి స్వగృహాన్నికి వెళ్లారు. తీవ్ర దుఃఖంలో ఉన్న సర్పంచ్ కుటుంబ సభ్యులను ఆయన నేరుగా పరామర్శించి, ధైర్యం చెప్పి ఓదార్చారు.
సర్పంచ్ చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గ్రామాభివృద్ధి కోసం ముద్ద రాములు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ, ఆయన మృతి కొల్పూర్ గ్రామానికి మరియు మండల ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
సర్పంచ్ రాములు కుటుంబం ఒంటరి కాదు. శోకసంద్రంలో ఉన్న ఈ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శివరామిరెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆంజనేయులు, సూర్య రిపోర్టర్ మాగనూర్ మండలం