గంబుషియా చేపలను చెరువులో వదిలిన వైద్య సిబ్బంది
పుంగనూరు: జిల్లా మలేరియా అధికారి పంపిణీ చేసిన గంభూషియా చేపలను తూర్పుమొగసాల యు పి హెచ్ సి వైద్యాధికారి , సబ్ యూనిట్ అధికారి ఆధ్వర్యంలో బుధవారంతూర్పుమొగసాల పరిధిలో గల పట్టణ నడిబొడ్డున ఉన్న పుంగమ్మ చెరువు పలమనేరు రోడ్డు లో గల సుబ్బమ్మ చెరువు ,నక్కబండ చెరువు లనందు వదలడం జరిగింది .బహుళార్థ సాధక ఆరోగ్య కార్యకర్త సోమశేఖరాచారి మాట్లాడుతూ దోమల వృద్ధిని నియంత్రించి, దోమల ద్వారా వ్యాపించే మలేరియా వంటి వ్యాధుల నివారణకు గంభూషియా చేపలను చెరువుల్లో వదలడం జరిగింది అన్నారు . ఈ కార్యక్రమంలో పట్టణంలో గల తూర్పుమొగసాల యు పి హెచ్ సి వైద్యాధికారి జయంత్ సాయి , సబ్ యూనిట్ అధికారి గంగయ్య ఫార్మాసిస్ట్ షఫీవుల్లా పాల్గొన్నారు.
రెడ్డి గౌని రెడ్డప్ప సూర్య రిపోర్టర్ పుంగనూరు అన్నమయ్య జిల్లా