BREAKING
నరజాముల తాండలో వివాదాస్పద భూములపై ఆర్డివో తనిఖీ వచ్చే మార్చిలోగా జిల్లాలో రైతులందరికీ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు -- సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని తో కలిసి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్ వెట్రి సెల్వి కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు.. నమూనాల సేకరణ. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పరిశీలించిన. జిల్లా వ్యవసాయ అధికారి. మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన కాంగ్రెస్ నాయకులు... స్టేషన్ రోడ్డులో నీళ్ళు రావడం లేదు గుండాల ఆసుపత్రి సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ? నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి మనిషి బ్రతికుంటే ఓటు కావాలి చనిపోతే ఆరడుగుల స్థలం దొరకని దుస్థితి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు భూములకు విముక్తి. రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు. భద్రాచలం రహదారి సమస్యపై హరీష్ రావుకు వినతి. రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల కరపత్రం ఆవిష్కరణ సబ్‌స్టేషన్లలో విద్యుత్ సామర్థ్యం పెంపు

ఉచిత వైద్య శిబిరాలు రోగులకు ఎంతో మేలు

Select Suryaa Now
ఉచిత వైద్య శిబిరాలు రోగులకు ఎంతో మేలు

రేపల్లె మేజర్ న్యూస్; 
ఉచిత వైద్య శిబిరాల ద్వారా ఎంతో మంది రోగులు లబ్ధి పొందుతున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు అనగాని శివప్రసాద్ అన్నారు గురువారం ప్రభుత్వ వైద్యశాలలో సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు. ఇటీవల మరమ్మతులకు గురైన ఆక్సిజన్ ప్లాంటును పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అదించేందుకు మంత్రి అనగానీి సత్యప్రసాద్ నిరంతరం కృషి చేస్తున్నారని అందులో భాగంగానే ప్రభుత్వ వైద్యశాలను వంద పడకల వైద్యశాలగా అప్గ్రేడ్ చేయించి నిధులు మంజూరు చేయించారని వైద్యం కోసం దూర ప్రాంతం వెళ్లకుండా మన ప్రభుత్వ వైద్యశాలలోని సకల సౌకర్యాలతో అధునాతన పద్ధతులలో వైద్యశాల నిర్మిస్తారని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ మమ్మలనేని రమేష్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వస్తున్న ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించాలని దృక్పథంతో దాతల సహకారంతో వైద్యశాలకు కావలసిన పరికరాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని రానున్న కాలంలో మరింత కార్పొరేట్ వైద్యాన్ని కూడా రోగులకు అందిస్తామని తెలిపారు. వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ పృథ్వి గణేష్ కొలసాని మాట్లాడుతూ వైద్యశాలలో వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ రోగులకు కావలసిన వైద్యాన్ని సకాలంలో అందిస్తున్నామని గుండెపోటుకు పాము కటుకు కూడా ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని ఎవరు కంగారు పడకుండా ప్రమాదం జరిగిన వెంటనే ప్రశాంతంగా ఉంటూ వైద్యశాలకు రావాలని తద్వారా ప్రాణాన్ని నిలబెట్టుకోవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు వేణు, వైద్యులు వైద్య సిబ్బంది కూటమి ప్రభుత్వ నాయకులు తదితరులు పాల్గొన్నారు.