BREAKING
27వ ప్రపంచ దృష్టి దినోత్సవకార్యక్రమము విజయ్‌ దేవరకొండ రణబాలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్: మా కెరీర్‌లో ఇది గొప్ప సినిమా అవుతుంది డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన తహసిల్దార్. ఇర్కీన్ GP వాటర్ మెన్ రాములు అకాల మృతి రెండవ రోజు సంగారెడ్డిలో దీక్ష కొనసాగించిన జగ్గారెడ్డి, నిర్మల విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి కొండయ్యను పరామర్శించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు పొదిలి మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సీమంతాలు పంచాయతీ నిధులపై ఆడిటింగ్ పోషణ మాసంతో ఓబులక్కపల్లిలో పండగ వాతావరణం పల్లెపండుగ 3.0 లో సిసి రోడ్లకు శంకుస్థాపన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహనా కార్యక్రమం ఉచిత వైద్య శిబిరాలు రోగులకు ఎంతో మేలు తూప్రాన్ లో విద్యుత్ కోతులను నిరసిస్తూ ఆందోళన

గిద్దలూరులో జూనియర్ కళాశాలల్లో డీఐఈఓ ఆకస్మిక తనిఖీలు

Select Suryaa Now
గిద్దలూరులో జూనియర్ కళాశాలల్లో డీఐఈఓ ఆకస్మిక తనిఖీలు

బీఐఈ ఏపీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి — డీఐఈఓ కె. స్వరూపారాణి

 గిద్దలూరు మేజర్ న్యూస్      మార్కాపురం జిల్లా డీఐఈఓ కె. స్వరూపారాణి గిద్దలూరులోని వివిధ జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలల విద్యా నిర్వహణ, పబ్లిక్ పరీక్షల ఫీజుల వసూలు, ప్రాక్టికల్ తరగతులు, వొకేషనల్ విద్యార్థుల ఓజెటి  శిక్షణ, సెలవుల అమలు తదితర అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా డీఐఈఓ కె. స్వరూపారాణి మాట్లాడుతూ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్  నిబంధనలను అన్ని జూనియర్ కళాశాలలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బోర్డు నిబంధనలకు అనుగుణంగా కళాశాలల నిర్వహణ కొనసాగించాలని సూచించారు.

పబ్లిక్ పరీక్షల ఫీజులు నిర్ణీత మొత్తంలోనే వసూలు చేయాలి విద్యార్థుల నుంచి పబ్లిక్ పరీక్షల ఫీజులను నిర్ణయించిన మొత్తంలో మాత్రమే వసూలు చేయాలని డీఐఈఓ సూచించారు.- ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫీజు – రూ.600/-- ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫీజు – రూ.600/-

- ప్రాక్టికల్ పరీక్షల ఫీజు – రూ.275/- మాత్రమే

సైన్స్ విద్యార్థులకు క్రమం తప్పకుండా ప్రాక్టికల్ తరగతులు సైన్స్ గ్రూపుల విద్యార్థులకు రెగ్యులర్‌గా ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాలని డీఐఈఓ ఆదేశించారు. విద్యార్థులకు ప్రయోగాత్మక పరిజ్ఞానం అందేలా ప్రయోగశాలలను సక్రమంగా వినియోగించాలని సూచించారు.

 ప్రభుత్వ సెలవులు, ఆదివారాల్లో తరగతులు నిర్వహించరాదు.ప్రభుత్వం లేదా బీఐఈ ఏపీ ప్రకటించిన సెలవు దినాల్లో కళాశాలల్లో తరగతులు నిర్వహించరాదని ఆమె ఆదేశించారు. సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన కళాశాలలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఐఈఓ కె. స్వరూపారాణి హెచ్చరించారు.

ఈ ఆకస్మిక తనిఖీల సందర్భంగా ఎస్.వి. జూనియర్ కళాశాల, గిద్దలూరు ప్రిన్సిపాల్ ఎం. మురళీకృష్ణ  డీఐఈఓ వెంట పాల్గొన్నారు. గిద్దలూరులోని జూనియర్ కళాశాలల విద్యా నిర్వహణ, పరీక్షల విధివిధానాలు, ప్రాక్టికల్ తరగతులు, ఓజెటి   శిక్షణ మరియు సెలవుల అమలుపై ఈ సందర్భంగా సమీక్షించారు.బీఐఈ ఏపీ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, విద్యా వ్యవస్థలో క్రమశిక్షణను కొనసాగించాలని డీఐఈఓ కె. స్వరూపారాణి అన్ని జూనియర్ కళాశాలల యాజమాన్యాలకు సూచించారు.