ఇర్కీన్ GP వాటర్ మెన్ రాములు అకాల మృతి
★ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు
★ వాటర్ మెన్ కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10వేల ఆర్థిక సహాయం అందజేత
మాడ్గుల మండలం ఇర్కీన్ గ్రామపంచాయతీ వాటర్ మెన్ బావండ్లపల్లి రాములు గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఆయన మృతివార్త తెలుసుకున్న ఇర్కీన్ గ్రామ సర్పంచ్ బావండ్లపల్లి కోటయ్య, ఉపసర్పంచ్ గాదెమోని ఈశ్వరగౌడ్, మాడ్గుల మాజీ జడ్పీటీసీ సభ్యులు వగాశి రవితేజ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి రాములు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామపంచాయతీ తరపున బావండ్లపల్లి రాములు అంత్యక్రియల నిమిత్తం 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సర్పంచ్, ఉపసర్పంచ్ మృతుడి కుటుంబీకులకు అందజేశారు. అధైర్య పడవద్దు, అండగా తామున్నామని ప్రభుత్వపరంగా తగిన సహాయం అందేలా చూస్తామని ఈ సందర్భంగా మృతుడి కుటుంబీకులకు వారు భరోసానిచ్చారు. వాటర్ మెన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించినవారిలో సర్పంచ్, ఉపసర్పంచ్, మాజీ జడ్పీటీసీతో పాటు వార్డు సభ్యులు వల్లేటి రాములు, బావాజీ శంకర్, అల్లె మల్లేష్, ఆరెకంటి కిరణ్, కాంగ్రెస్ నాయకులు బొడ్డు శంకర్ తదితరులు ఉన్నారు.
ఆర్. నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల