పొదిలి మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం
-అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి యూనిఫారాల పంపిణీ
పొదిలి, మేజర్ న్యూస్ ;
స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ ఇమామ్ సాహెబ్ అధ్యక్షతన సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో 2026 సంవత్సరానికి సంబంధించిన త్రైమాసిక ఆదాయ-వ్యయ నివేదికలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాలకు సంబంధించిన లెక్కలను కూలంకషంగా పరిశీలించి, సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు సయ్యద్ ఇమామ్ సాహెబ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా మార్కెట్ కమిటీ పనిచేస్తోందని, నిధుల వినియోగంలో పారదర్శకతకు ఎప్పుడూ పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు.సమావేశం అనంతరం, మార్కెట్ కమిటీలో నిత్యం శ్రమిస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ప్రోత్సహించే ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా యూనిఫారాలను పంపిణీ చేశారు. ఒకే రకమైన దుస్తుల్లో సిబ్బంది మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పండేటి తిమోతితో పాటు పలువురు కమిటీ డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.