పల్లెపండుగ 3.0 లో సిసి రోడ్లకు శంకుస్థాపన
జంగారెడ్డిగూడెం సూర్ న్యూస్: మండలంలోని మైసన్నగూడెం గ్రామం నందు టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు గారపాటి రామకృష్ణ, మండల అధ్యక్షుడు కుక్కల మాధవరావు, ఆకుల రాకేష్ ఆధ్వర్యంలో పల్లెపండుగ 3.0 లో భాగంగా గ్రామంలో 20,లక్షల విలువ గల సిసి రోడ్ల శంకుస్థాపనలో జడ్పిటిసి సభ్యులు పోల్నాటి శ్రీనివాస్ బాబు పాల్గొని పనులు ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమా మహేశ్వరి మండల ఉపాధ్యక్షులు గొల్లమందల శ్రీనివాస్ పిఎసిఎస్ డైరెక్టర్ తాళ్లూరు వెంకటేశ్వరరావు క్లస్టర్ ఇంచార్జ్ రాగాని శ్రీను దావీదు బోడ శ్రీనివాస్ చదలవాడ నాగేశ్వరరావు ఉండ్రాజువరపు శ్రీనివాస్ నూనె పుల్లారావు మద్ది సుబ్బారావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్ టీవీ రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూర జిల్లా