మునగాల సీఐగా ప్రతాప లింగం బాధ్యతల స్వీకరణ
మునగాల మేజర్ న్యూస్: మునగాల సర్కిల్ పరిధిలో సీఐగా పనిచేసిన రామకృష్ణారెడ్డి కోదాడ రూరల్ సీఐగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మునగాల సీఐగా ప్రతాప లింగం నియమితులయ్యారు.
ప్రతాప లింగం గతంలో కోదాడ రూరల్ సీఐగా కొంతకాలం పనిచేశారు. అనంతరం ఐజీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. తాజాగా ఐజీ కార్యాలయం నుంచి మునగాల సీఐగా బదిలీపై వచ్చిన ఆయన బుధవారం మునగాల సీఐగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రతాప లింగం మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.