ప్రభుత్వాసుపత్రిలో ఐటీడీఏ పీవో రాహుల్ ఎమ్మెల్యే జారే పర్యటన
*ప్రభుత్వాసుపత్రిలో ఐటీడీఏ పీవో రాహుల్ ఎమ్మెల్యే జారే పర్యటన*
రెండు రాష్ట్రాల పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న అశ్వరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐటీడీఏ నిధులతో రూ.05 లక్షల రూపాయల విలువ గల వైద్య పరికరాలను అందించడం జరిగిందని అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు.
బుధవారం నాడు అశ్వరావుపేట ఏరియా ఆసుపత్రిలో రోగుల కోసం నూతనంగా 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇన్ పేషెంట్ వార్డును ప్రారంభించిన అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ రాధా రుక్మిణికి ఆస్పత్రికి ముఖ్యమైన పరికరాలైన డెంటల్ చైర్స్, మంచాలు, ఆక్సిజన్ సిలిండర్స్,పీతల్ దుప్పలర్స్, తదితర సామాగ్రి అందించారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ*
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అవసరమైన ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి, రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.వైద్య పరికరాలను సద్వినియోగం చేసుకుని రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు.
*ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ*
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, వైద్య సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అశ్వరావుపేట ఏరియా ఆసుపత్రికి అందించిన వైద్య పరికరాల ద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని, మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల నుండి గిరిజనులు ఎక్కువ శాతం ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నందున వైద్యాధికారులు స్థానికంగా ఉండి గిరిజనులకు వైద్య సేవలు తప్పనిసరిగా అందించాలనితెలిపారు..ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ సైదులు మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, ఆర్ ఎం ఓ మౌనిక మరియు హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి మునీర్ అశ్వారావుపేట