మోదీకి అభినందనగా నెల్లూరు రూరల్‌లో భారీ బైక్ ర్యాలీ
ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిర్వహించారు. భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బైక్‌లతో ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రధాన మార్గాల మీదుగా సాగిన ర్యాలీ సందర్భంగా మోదీకి అభినందనలు తెలియజేస్తూ నినాదాలు చేశారు. ప్రజా సేవలో 25 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ సేవా ప్రస్థానానికి గుర్తుగా.. నెల్లూరు రూరల్‌లో టీడీపీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.