ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. అక్టోబర్ 9 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్: వైవా హర్ష
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు వైవా హర్ష ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త నవ్వుల వెబ్ సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బాబు డెగాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాజ్ సుహాస్, ప్రమదేశ్వి వి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సిరీస్ ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ ద్వారా అక్టోబర్ 9 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఘనంగా ప్రీ బ్యాచలర్ పార్టీ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ వేడుకలో వైవా హర్ష మాట్లాడుతూ, ఈటీవీతో తమకు విడదీయరాని అనుబంధం ఉందని, చిన్నప్పటి నుంచి ఈటీవీ కార్యక్రమాలు చూస్తూనే పెరిగామని తెలిపారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఒక ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి రిలీజ్‌కు తీసుకురావడం కేస్ స్టడీ లాంటి విషయమని, ఎక్కడా రాజీ పడకుండా ఈ వెబ్ సిరీస్‌ను గ్రాండ్‌గా నిర్మించినట్లు చెప్పారు. ఇందులో పూర్తి స్థాయి వినోదంతో పాటు మంచి భావోద్వేగాలు కూడా ఉన్నాయని, ప్రేక్షకులు తమ కుటుంబసభ్యులందరితో కలిసి దీన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చని పేర్కొన్నారు. మొదటి రెండు ఎపిసోడ్లను ఉచితంగా అందిస్తున్నామని, ఆ తర్వాత కచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేసుకుని పూర్తి సిరీస్‌ను ఆస్వాదిస్తారనే నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే దీనికి రెండో సీజన్‌ను కూడా తీసుకువస్తామని ప్రకటించారు.
ఈటీవీ ప్రతినిధి సాయి కృష్ణ మాట్లాడుతూ, ఈ సిరీస్‌కు ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే అద్భుతమైన టైటిల్‌ను సందీప్ సూచించారని తెలిపారు. ఈటీవీ విన్ ఎంతోమంది కొత్త దర్శకులను, టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిందని, ఈ సిరీస్ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న బాబు భవిష్యత్తులో మరిన్ని గొప్ప అవకాశాలు అందుకోవాలని ఆకాంక్షించారు. దర్శకుడు బాబు మాట్లాడుతూ, ‘మంత్ అఫ్ మధు’ సినిమా చూసి హర్ష నటనకు అభిమాని అయిపోయానని, ఈ కథకు ఆయనైతేనే కరెక్ట్ అని భావించి సంప్రదించగా వెంటనే అంగీకరించారని తెలిపారు. ఈ జర్నీలో తనకు సహకరించిన ఈటీవీ సాయికి, నిర్మాతలకు మరియు ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత చవాన్ మాట్లాడుతూ, ఈటీవీ విన్ ఏది చేపట్టినా అది విజయవంతం అవుతుందని, ఈ సిరీస్‌లో వినోదంతో పాటు బలమైన ఎమోషన్స్ కూడా పండాయని వెల్లడించారు. అక్టోబర్ 9న ఈటీవీ విన్‌లో విడుదలవుతున్న ఈ సిరీస్‌కు సంబంధించి అక్టోబర్ 8వ తేదీనే శ్రీరాములు థియేటర్‌లో ప్రీమియర్ షో వేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ నటుడు హైపర్ ఆది మాట్లాడుతూ, ఈ వెబ్ సిరీస్ చాలా అద్భుతంగా వచ్చిందని, డైరెక్టర్ అందరి నుంచి చక్కటి నటన రాబట్టుకున్నారని ప్రశంసించారు. హీరోయిన్ ఐశ్వర్య మాట్లాడుతూ, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో తన ప్రయాణం ప్రారంభం కాగా, ఇప్పుడు ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వెబ్ సిరీస్‌లో నటించడం మరపురాని అనుభూతినిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్ సభ్యులందరూ ఈ సిరీస్ పెద్ద విజయం సాధించాలని కోరారు.
Also Read: రాకేష్ వర్రే ‘మాయలేడి’ నుంచి హార్ట్ టచింగ్ లీరికల్ సాంగ్.. చీకటి వైపున పాట విడుదల!